Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్‌తో శ్రీలీల ఫైట్ – ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?
ధమాకా బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌లో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని అంగీకరించింది. ఎక్తా కపూర్ నిర్మించనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ మరో హీరోయిన్‌గా నటించబోతుంది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ అబ్సెషన్ తరహాలో చాలా వయలెంట్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్లు ఫిక్సైనా... ఈ సినిమాకు ఇంకా హీరో మాత్రం దొరకలేదని టాక్.
Sreeleela | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ధమాకా హీరోయిన్ శ్రీలీల ఇద్దరూ ఒకే అబ్బాయితో ప్రేమలో పడ్డారు. ప్రియుడిని తమ సొంతం చేసుకోవడానికి ఒకరికి తెలియకుండా మరొకరు కన్నింగ్ ప్లాన్స్ వేశారు. అయితే ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. జాన్వీ కపూర్, శ్రీలీల హీరోయిన్లుగా బాలీవుడ్‌లో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఉమేష్ బిస్త్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎక్తా కపూర్‌తో కలిసి గునీత్ మోంగా ప్రొడ్యూస్ చేయబోతున్నారు.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ...
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఇందులో శ్రీలీల, జాన్వీకపూర్ ఇద్దరి రోల్స్ నెగెటివ్ షేడ్స్‌లో ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ అబ్సెషన్ టైప్‌లో చాలా వయలెంట్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
హీరో ఎవరంటే?
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో హీరో కంటే ముందు హీరోయిన్లను మేకర్స్ ఫైనల్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చాలా సినిమాల్లో ముందుగా హీరో ఎవరన్నది డిసైడ్ చేసిన తర్వాతే హీరోయిన్ల కోసం అన్వేషిస్తుంటారు. ఆ రూల్‌ను ఈ సినిమాతో నిర్మాత ఎక్తా కపూర్ తిరగరాసింది. ముందుగా హీరోయిన్లను సెలెక్ట్ చేసింది. ప్రస్తుతం హీరో కోసం సెర్చింగ్‌లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అతడెవరన్నది ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. హీరో ఒకే అయిన తర్వాతే సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
గుడ్‌టైమ్ షురూ...
శ్రీలీల గుడ్‌టైమ్ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్‌సింగ్, పరాశక్తి డిజాస్టర్లతో శ్రీలీల పనైపోయిందంటూ విమర్శలొచ్చాయి.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో డాక్టర్‌గా సెటిలైపోవాలని ఈ ధమాకా బ్యూటీ ఫిక్సైనట్లు రూమర్లు హల్‌చల్ చేశాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ గత కొద్ది రోజులుగా వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ధనుష్ ఓం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాణంలో రూపొందుతోన్న సినిమాలో శ్రీలీల ఛాన్స్ దక్కించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌తో కలిసి కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..
- ●Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
- ●Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర
- ●Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ
- ●Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!
- ●Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి

Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..

Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం

Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర

Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ






