Indigo | కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
Indigo | ఇండిగో (Indigo) విమానాల సంక్షోభం (Crisis) ఎనిమిదవ రోజు ఇప్పటి వరకు 300 విమానాలు రద్దయ్యాయి
Indigo | ఇండిగో (Indigo) సంక్షోభం (Crisis) నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల (Airport) నుంచి ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. సంక్షోభం ప్రారంభమై ఎనిమిదవ రోజైన మంగళవారం దేశవ్యాప్తంగా సుమారు 300 పైగా విమానాలకు ఇప్పటి వరకు రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 58 విమానాలు రద్దయ్యాయి. అందులో ఇక్కడ బయల్దేరే విమానాలు 44 కాగా, ఇక్కడికి వచ్చే విమానాలు 14. ఒకవైపు పరిస్థతిని చక్కదిద్దుతున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించినప్పటికీ అది ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇండిగో వింటర్ షెడ్యూల్లో అయిదు శాతం కోత విధిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ (Civil Aviation) మంత్రి రామ్మోహన్నాయుడు ప్రకటించారు. ఆ స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయిస్తామని చెప్పారు. ఇండిగో విమానాలలో నవంబర్ 21వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు మొత్తం 9,55,591 విమాన టికెట్లు రద్దు చేయగా, వాటిలో రూ.827 కోట్లు రిఫండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మిగిలినవి ఈ నెల 15వ తేదీలోగా రిఫండ్ చేయనున్నట్లు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
మే 6, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026

Karnataka | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



