Thummala Nageshwar Rao | ప్రత్యేక కేంద్ర సహాయం కింద రాష్ట్రానికి రూ.1,087.64 కోట్లు
Thummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్: రాష్ట్ర వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం కింద ప్రత్యేక కేంద్ర సహాయం రూపంలో రూ.1,087.64 కోట్ల నిధులను అందుకుని దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.
దేశంలోనే నిధులు పొందిన తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
వ్యవసాయ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి జాతీయ స్థాయిలో గుర్తింపు
ఫార్మర్ రిజిస్ట్రీ, ఎరువుల పంపిణీలో సమర్థ విధానాల అమలుకు కేంద్రం నుంచి ప్రోత్సాహకం
రైతులకు సులభతరమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Thummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్: రాష్ట్ర వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం కింద ప్రత్యేక కేంద్ర సహాయం రూపంలో రూ.1,087.64 కోట్ల నిధులను అందుకుని దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అమలు చేసిన వినూత్న విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా సాధించిన పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ సేవలను రైతులకు మరింత చేరువ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతికి కేంద్రం నుంచి ఈ ప్రోత్సాహకం లభించిందన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతుల ఫార్మర్ ఐడీలను నమోదు చేసినందుకు గాను రూ.422.64 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయ నిధులను కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 26న విడుదల చేసిందని మంత్రి వివరించారు. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్ ద్వారా ఎరువుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేసినందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోదించిన రూ.665 కోట్ల ప్రోత్సాహక నిధులు మూడు విడతల్లో పూర్తిగా విడుదలయ్యాయని తెలిపారు. మొదటి విడతలో రూ.175 కోట్లు, రెండో విడతలో రూ.165 కోట్లు, మూడో విడతలో రూ.325 కోట్లు అందాయని పేర్కొన్నారు. ఈ విధంగా రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.1,087.64 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయం లభించిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు మూడు దశల్లో ఎఫ్ఎస్ఎస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామని మంత్రి తెలిపారు. తొలుత రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, అనంతరం 50 శాతం జిల్లాలకు విస్తరించి, చివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేశామన్నారు. ఈ విధానం ద్వారా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని పొందిన ఐడీ ఆధారంగా తమకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉన్న డీలర్ల వద్ద సులభంగా కొనుగోలు చేసే అవకాశం కలిగిందన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఇబ్బందులు తగ్గడంతో పాటు, రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల వివరాలు సమగ్రంగా అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు వీలవుతోందని మంత్రి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లోనూ రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా పంటల కొనుగోలు సమయంలో కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఉపయోగపడుతుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను సులభంగా విక్రయించేందుకు దోహదపడుతుందని వివరించారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ఈ ఘనత వెనుక వ్యవసాయ శాఖ అధికారుల సమిష్టి కృషి ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగారి మార్గదర్శకత్వంలో, తన నిరంతర పర్యవేక్షణలో వ్యవసాయశాఖ కార్యదర్శి, వ్యవసాయశాఖ సంచాలకులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు, క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగామని తెలిపారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి అన్నారు. కేవలం నిధులు సాధించడమే కాకుండా, ఆ విధానాల ద్వారా రైతులకు వాస్తవ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతూ, రైతులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
నవంబర్ 20, 2026

SI Prelims | ఈ నెల 29న రాత పరీక్ష.. ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
నవంబర్ 20, 2026

Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాల తరలింపు.. సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..
- ●Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం
- ●Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
- ●Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో
- ●CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..

Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్

Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో



