Minister Damodar Raja Narasimha | కలిసి పోరాడితే క్యాన్సర్‌ను గెలవొచ్చు: వరల్డ్ హెల్త్ డే లో మంత్రి దామోదర రాజనర్సింహ
Minister Damodar Raja Narasimha | కలిసి పోరాడితే క్యాన్సర్(Cancer)ను గెలవొచ్చని.. ఈరోజు క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) పేర్కొన్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి నాన్ కమ్యునికెబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: కలిసి పోరాడితే క్యాన్సర్(Cancer)ను గెలవొచ్చని.. ఈరోజు క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన పునాది అని చెప్పారు. వరల్డ్ హెల్త్ డే(World Health Day)ను పురస్కరించుకొని రవీంద్రభారతి(Ravindra Bharathi) లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి నాన్ కమ్యునికెబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు.

క్యాన్సర్, ఇతర వ్యాధులపై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా NCD క్లినిక్స్, డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, పాలియేటివ్, జెరియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. డయాలిసిస్ సేవలను విస్తరిస్తూ కొత్తగా 79 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ సేవల వల్లే ప్రజల ఆరోగ్యం పదిలంగా ఉందన్నారు. కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్ సేవలను మెరుగుపరుస్తున్నాం. ఈ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరెటివ్, రిహాబిలిటేటివ్ విధానంతో సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం థీమ్ “Together for Health – Stand with Science” ఆరోగ్య రంగంలో శాస్త్రం, సహకారం, ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది.
10 నిమిషాల్లోపే చేరుకునేలా..
109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు, రూ.1100 కోట్ల వ్యయంతో నాలుగు స్థాయిల ట్రామా కేర్ వ్యవస్థను అమలు చేయబోతున్నాం. అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తూ 213 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలో మరిన్ని అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువస్తాం. 10 నిమిషాల లోపు ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకునే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని మంత్రి వివరించారు.
క్యాన్సర్ రిజిస్ట్రీ ద్వారా కచ్చితమైన డేటాతో మెరుగైన ప్రణాళికలు రూపొందిస్తాం. ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో పాలియేటివ్ కేర్ అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో రీజినల్ క్యాన్సర్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.
AstraZeneca తో కలిసి 20 ప్రభుత్వ హాస్పిటళ్లలో లంగ్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పై పైలట్ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించనున్నాం. ఇందుకోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకున్నాం. ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించాం. 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. Clinical Establishments Act పోర్టల్‌ను ప్రారంభించాం. PCPNDT, ART, Surrogacy చట్టాల అమలుకు ప్రత్యేక పోర్టల్స్ తీసుకొచ్చాం. పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుత వ్యవస్థను తయారు చేస్తున్నాం.
ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నాం. జిల్లా స్థాయిలోనే 80% వైద్య అవసరాలు తీర్చే లక్ష్యంతో సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. TIMS ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నాం. NIMSలో అత్యాధునిక LINAC సేవలను ప్రారంభించాం. 2000 పడకల కొత్త భవనం నిర్మాణం జరుగుతోంది. ఆరోగ్యశాఖలో ప్రస్తుతం 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. ప్రతి రోగిని గౌరవంతో, ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని మంత్రి దామోదర పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Phule Birth Anniversary | పూలే స్ఫూర్తితో తల రాతను మార్చుకుందాం: మంత్రి వాకిటి శ్రీహరి
ఏప్రిల్ 11, 2026

Minister Damodar Raja Narasimha | ఉస్మానియా తరహాలో మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్ అభివృద్ధి: మంత్రి దామోదర
ఏప్రిల్ 10, 2026

Alishetty Prabhakar | రవీంద్ర భారతిలో అలిశెట్టి జయంతి సభ
జనవరి 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



