Minister Damodar Raja Narasimha | ఉస్మానియా తరహాలో మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్ అభివృద్ధి: మంత్రి దామోదర
Praja Palana Pragati Pranalika | ఉస్మానియా మెడికల్ కాలేజీ తరహాలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్(Mahaboobnagar Medical college)ను అభివృద్ధి చేస్తున్నామని, పాలమూరును దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
త్రినేత్ర.న్యూస్: ఉస్మానియా మెడికల్ కాలేజీ తరహాలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్(Mahaboobnagar Medical college)ను అభివృద్ధి చేస్తున్నామని, పాలమూరును దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి మెడికల్ కాలేజీని రిఫరల్ ఆస్పత్రిగా ఆధునికరించబోతున్నామన్నారు. పీజీ సీట్లు కూడా పెంచుతామని చెప్పారు.

జిల్లాలో జాతీయ రహదారుల వెంట ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, హాస్టల్స్, ఆడిటోరియం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా PHC నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. 95 శాతం చికిత్సలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదనంగా 14 డిపార్ట్మెంట్ లను పెంచబోతున్నామని వివరించారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్, వాస్కులర్ యాక్సెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్జికల్ డిపార్ట్మెంట్ ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి, ఆధునిక ఎక్విప్మెంట్ ను సమకూర్చడానికి పాటు పడుతామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా అప్ గ్రేడ్ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేస్తున్నామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మహబూబ్ నగర్‌కు IIIT ఐటీ వచ్చిందన్నారు.
అంతకుముందు ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్నిఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ఆయుష్ ఆధ్వర్యంలో హోమియోపతి, ఆయుష్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన యోగా, ఉచిత ఆయుర్వేద, యునాని శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.నరేంద్ర కుమార్, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ రవీందర్ కుమార్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ హరిప్రియ, జిల్లా వైద్య, ఆరోగ్య, ఆయుష్, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Public Toilets to Day Care Centers | ‘పబ్లిక్ టాయిలెట్స్’ టు ‘డే కేర్ సెంటర్స్’.. హైదరాబాదీలకు ఏం కావాలి..?
ఏప్రిల్ 24, 2026

Minister Damodar Raja Narasimha | కలిసి పోరాడితే క్యాన్సర్‌ను గెలవొచ్చు: వరల్డ్ హెల్త్ డే లో మంత్రి దామోదర రాజనర్సింహ
ఏప్రిల్ 7, 2026
తాజావార్తలు
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్



