Alishetty Prabhakar | రవీంద్ర భారతిలో అలిశెట్టి జయంతి సభ
Alishetty Prabhakar | కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సభ నేడు రవీంద్ర భారతిలో సోమవారం నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు.
Alishetty Prabhakar | కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సభ సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంలోని తీవ్రతను వివరించారు. సామాజికంగా అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, తనకు అలిశెట్టి ప్రభాకర్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఏ విధంగా పరిచయమయ్యారో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ కొత్త కవులు, యువతరం అలిశెట్టి ప్రభాకర్‌ను చదవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పాశం యాదగిరి మాట్లాడుతూ చిన్న కవిత్వం రాసిన అలిశెట్టి జీవితాన్ని కూడా చిన్నతనంలోనే ముగించటం దురదృష్టం అన్నారు. నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ అలిశెట్టితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరో వక్త బద్రి నర్సన్ మాట్లాడుతూ పాఠకుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యాన్ని మరోసారి ముద్రించాలని కోరారు. కార్యక్రమంలో అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సంగ్రామ్, అలిశెట్టి సన్నిహితులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం
- ●CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం






