త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Land acquisition | పార్టీని గెలిపిస్తే భూములు లాక్కుంట‌రా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ స‌ర్పంచ్ ఫైర్

Land acquisition | త‌మ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ (Industrial park) పేరిట బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ (Land acquisition) చేస్తున్నార‌ని కాంగ్రెస్ స‌ర్పంచ్‌ పులింద‌ర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఫైరయ్యారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి పని చేస్తే 5 వేల ఎక‌రాల‌కు పైగా భూములు లాక్కోవ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. గ‌తంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తెలియ‌జేసినా ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు.

S

News | Published On Mar 26, 2026, 3.40 pm IST

Land acquisition | పార్టీని గెలిపిస్తే భూములు లాక్కుంట‌రా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ స‌ర్పంచ్ ఫైర్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: ఎక్క‌డైనా.. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు మ‌ద్దతు ఇచ్చిన‌వారు ఏం చేసినా చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కానీ ఓ స‌ర్పంచ్ ఇందుకు భిన్నంగా స్పందించాడు. త‌మ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ (Industrial park) పేరిట బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ (Land acquisition) చేస్తున్నార‌ని కాంగ్రెస్ స‌ర్పంచ్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఫైరయ్యారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి పని చేస్తే మా భూములు లాక్కుంటారా? అని మండిప‌డ్డారు.

వికారాబాద్ (Vikaarabad) జిల్లా పరిగి మండలంలోని కాడ్లాపూర్ (Kadlapur) స‌ర్పంచ్ పులింద‌ర్ (Sarpanch Pulindar) కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో గెలుపొందారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని త‌పించిన నాకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంద‌ని ఆయ‌న‌ ఆవేద‌న చెందారు. పరిగి మండలంలోనే ప్ర‌జ‌లు అధిక మెజారిటీ ఇచ్చి త‌న‌ను గెలిపించార‌ని.. ఇప్పుడేమో రైతులను ఇబ్బందులకు గురి చేయ‌డం స‌రికాద‌ని ఆగ్రహించారు. 5 వేల ఎక‌రాల‌కు పైగా భూములు లాక్కోవ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. రైతులు రోడ్డున పడతారని ఆవేదన చెందారు. ఈ విష‌యాన్ని గ‌తంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తెలియ‌జేసినా ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కు కూడా వినతిపత్రాలు ఇచ్చిన‌ట్లు గుర్తు చేశారు.

ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పిన‌ప్ప‌టి నుంచి రైతులు తిండి తిన‌డం లేద‌ని.. ఎమ్మెల్యే భూసేకరణ ఆపాలని కోరారు. లేదంటే గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగుతామ‌ని హెచ్చ‌రించారు. పార్టీ కోసం పని చేస్తే గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స‌ర్పంచ్ పులింద‌ర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

https://x.com/TeluguScribe/status/2037092373650694419

Advertisement

తాజావార్తలు

Advertisement