Pawan Kalyan | షారుఖ్ ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్ – రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్‌ది డబ్బు కి లొంగని వ్యక్తిత్వమని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. షారుఖ్‌ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారని చెప్పాడు. హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Pawan Kalyan | ఓజీ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ పోస్ట్‌పోన్ కావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్ అనుకున్నదానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ లో సాంగ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
షారుఖ్‌ఖాన్‌తో సమానంగా...
"పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, సినిమాల జర్నీ ఎంతో కఠినంగా సాగింది. ఓవర్‌నైట్‌లోనే అన్నీ ఆయనకు వచ్చయలేదు. పవన్ కళ్యాణ్‌ది డబ్బు కి లొంగని వ్యక్తిత్వం. గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో యాడ్స్ తీయాలని చాలా కార్పొరేట్ సంస్థలు ప్రయత్నించాయి. ఆ టైమ్‌లో పాన్ ఇండియా ట్రెండ్ లేదు. 2012లోనే షారుఖ్‌ఖాన్ యాడ్స్ తీసుకునేంత రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్‌కు ఆఫర్ చేశారు. కానీ ప్రజలకు మంచి చేసేవి కాదని భావించి కోట్లు విలువ చేసే యాడ్స్ కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారు" అని హరీష్ శంకర్ అన్నారు.
రన్‌టైమ్ ఎంతంటే...
ఉస్తాద్ భగత్‌సింగ్ రన్‌టైమ్ రెండు గంటల ముప్ఫై ఐదు నిమిషాలు అయితే...పవన్ కళ్యాణ్ సినిమాలో రెండు గంటల కంటే ఎక్కువే స్క్రీన్‌పై కనిపిస్తారని హరీష్ శంకర్ అన్నారు. "పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తెలుగు ఆడియెన్స్ ఏం కోరుకుంటారో అవన్నీఈ సినిమాలో ఉంటాయి. డాన్స్, ఫైట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవన్ కళ్యాణ్ సెన్సాఫ్ హ్యూమర్, ఎనర్జీ, స్వాగ్ అభిమానులను ఆకట్టుకుంటాయి .ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రోజుకి 18 గంటలు కష్టపడిన రోజులు ఉన్నాయి" అని హరీష్ శంకర్ చెప్పారు.
మల్లారెడ్డి విలన్...
ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం మెయిన్ విలన్‌గా మొదట మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిని అనుకున్నాం. ఎంతో మందిని ప్రేమించే ఆయన్ని విలన్‌గా చూపించడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఆ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గాం అని హరీష్ శంకర్ చెప్పాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



