త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muhoozi Kainerugaba | నాకు అంద‌మైన అమ్మాయిని అప్ప‌గించండి: తుర్కియేకు ఉగాండా సైన్యాధిప‌తి హుకుం

Muhoozi Kainerugaba | ఉగాండా సైన్యాధిప‌తి (Uganda army chief) మ‌హూజీ కైనెరుగాబా (Muhoozi Kainerugaba) మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బుతో పాటు అంద‌మైన అమ్మాయిని అప్ప‌గించాల‌ని తుర్కుయేకు హుకుం జారీ చేయ‌డంతో తీవ్ర దుమారం రేగుతోంది. 30 రోజుల్లో త‌న డిమాండ్‌ను నెర‌వేర్చ‌కుంటే దౌత్యప‌రంగా తీవ్ర‌ ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

S

News | Published On Apr 12, 2026, 5.59 pm IST

Muhoozi Kainerugaba | నాకు అంద‌మైన అమ్మాయిని అప్ప‌గించండి: తుర్కియేకు ఉగాండా సైన్యాధిప‌తి హుకుం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉగాండా సైన్యాధిప‌తి (Uganda army chief) మ‌హూజీ కైనెరుగాబా (Muhoozi Kainerugaba) మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బుతో పాటు అంద‌మైన అమ్మాయిని అప్ప‌గించాల‌ని తుర్కుయేకు హుకుం జారీ చేయ‌డంతో తీవ్ర దుమారం రేగుతోంది. 30 రోజుల్లో త‌న డిమాండ్‌ను నెర‌వేర్చ‌కుంటే దౌత్యప‌రంగా తీవ్ర‌ ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి తుర్కుయేకు ఉగాండా రక్షణ కల్పిస్తోంది. ఉగాండా అందిస్తున్న సేవలకు బిలియన్ డాలర్ల నగదు ఇవ్వాల‌నే డిమాండ్‌ను తుర్కియే ముందుంచారు. నగదుతో పాటు తను పెళ్లి చేసుకోవడానికి ఆ దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిని అప్పగించాలని కోరాడు. ఇదంతా 30 రోజుల్లోపు జ‌ర‌గాల‌ని, లేదంటే త‌మ దేశంలోని తుర్కియే రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని హెచ్చరించారు.

అంత‌టితో ఆగ‌కుండా తమ గగనతలంలో తుర్కియే ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను నిలిపివేస్తామని చెప్పుకొచ్చారు. ఉగాండాకు ఉన్న సంబంధాలన్నీ త్వరలోనే తెంచుకుంటామని.. వెన్నుపోటు పొడిచే స్నేహితులు మాకొద్ద‌ని కైనెరుగాబా వ్యాఖ్యానించారు. తుర్కియేకు వెళ్లొద్ద‌ని దేశ ప్రజలకు సూచించారు. ఇజ్రాయెల్‌కు లక్ష మంది సైనికులను పంపనున్నట్లు చెప్పారు.

కాగా ఈయ‌న‌ 2022లోనూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni)ని వివాహం చేసుకుంటానని బహిరంగంగా ప్రకటించి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. మెలోనిని తనకు అప్పగిస్తే బదులుగా 100 అంకోలే జాతి ఆవులను ఇస్తానని ఆఫర్ కూడా ప్ర‌క‌టించాడు. ఈ వ్యాఖ్యలపై అతడి తండ్రి, ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని క్షమాపణలు చెప్పాల్సి వ‌చ్చింది. ప్రస్తుతం ఆయ‌న చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై తుర్కియే ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement