త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rafale Fighter Jets | రూ.3.25 ల‌క్ష‌ల కోట్ల‌తో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్న‌ల్‌.. మెగా డీల్‌పై త్వ‌ర‌లో సంత‌కాలు..!

Rafale Fighter Jets| భారత వాయుసేన (IAF) అమ్ములపొదిలోకి మరో 114 రఫేల్ అస్త్రాలు (Rafale Fighter Jets) చేరబోతున్నాయి. సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో.. 114 రఫేల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

D

News | Published On Feb 10, 2026, 2.38 pm IST

Rafale Fighter Jets | రూ.3.25 ల‌క్ష‌ల కోట్ల‌తో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్న‌ల్‌.. మెగా డీల్‌పై త్వ‌ర‌లో సంత‌కాలు..!
Advertisement

Rafale Fighter Jets| భారత వాయుసేన (IAF) అమ్ములపొదిలోకి మరో 114 రఫేల్ అస్త్రాలు (Rafale Fighter Jets) చేరబోతున్నాయి. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో.. 114 రఫేల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (France President Emmanuel Macron) ఢిల్లీ పర్యటనకు కొద్ది రోజుల ముందే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫ్రెంచ్‌ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్‌ నుంచి 114 రాఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డు ఇటీవ‌లే ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ ఒప్పందానికి కేంద్రం ఈ వారంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్రాన్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ (PM Modi), మాక్రాన్ మ‌ధ్య జ‌రిగే స‌మావేశంలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంత‌కాలు చేసే అవ‌కాశం ఉంది. మ‌న వైమానిక ద‌ళం వ‌ద్ద ప్ర‌స్తుతం 36 ర‌ఫేల్స్ ఉన్నాయి. మ‌రో 26 మెరైన్ వేరియంట్ల కోసం నేవీ ఆర్డ‌ర్ చేసింది. ఎం వ‌ర్ష‌న్‌కు చెందిన ఆ యుద్ధ విమానాల‌ను నౌకాద‌ళం సుమారు 63 వేల కోట్లు ఖ‌ర్చుతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.

టాటా భాగస్వామ్యంతో దేశీయ ఉత్పత్తి

ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో భాగంగా దాదాపు 100 యుద్ధ విమానాలను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. ఇందుకు డ‌సాల్ట్ ఏవియేష‌న్ సంస్థ స‌హ‌క‌రించ‌నున్న‌ది. హైద‌రాబాద్ కేంద్రంగా డ‌సో స‌హ‌కారంతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్) ఈ యుద్ధ విమానాల‌కు చెందిన ప్ర‌ధాన భాగాలు త‌యారు చేయ‌నుంది. రఫేల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాలు ఫ్రాన్స్‌ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం డ‌సో సంస్థ‌తో టాటా సంస్థ ఒప్పంద కూడా కుదుర్చుకుంది.

ర‌ఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముక‌గా నిలుస్తున్నాయి. గ‌తేడాది ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలోనూ ఇవి స‌త్తా చాటాయి. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 'స్కాల్ప్' క్రూయిజ్ క్షిపణులను ఈ ఆపరేషన్‌లో రఫేల్స్ ప్రయోగించినట్లు సమాచారం. ఈ యుద్ధ విమానాలు మెటియోర్, హ్యామర్ వంటి శక్తిమంతమైన క్షిపణులను కూడా మోయగలవు.

Advertisement
Advertisement