Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ జోరు.. సెన్సెక్స్ 1,300 పాయింట్లు అప్..
Stock Markets | దీపావళి సెలవుల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,302 పాయింట్లకు పైగా పెరగ్గా, నిఫ్టీ 25,350 మార్కును దాటింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.
Stock Markets | దీపావళి సెలవుల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,302 పాయింట్లకు పైగా పెరగ్గా, నిఫ్టీ 25,350 మార్కును దాటింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.
భారీ గ్యాప్ అప్‌తో సూచీలు..
దీపావళి-బలిపాడ్యమి సెలవుల అనంతరం బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.20 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,302.86 పాయింట్లు (1.61 శాతం) ఎగబాకి 82,409.51 వద్దకు చేరింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 331.20 పాయింట్లు (1.32 శాతం) లాభపడి 25,375.85 వద్ద ట్రేడయింది. ఈ రెండు సూచీలు ఫిబ్రవరి 27 తర్వాత అత్యధిక స్థాయిలను నమోదు చేశాయి. నిఫ్టీ తన 52 వారాల గరిష్ఠ స్థాయి 26,373.20తో పోలిస్తే ఇంకా 997 పాయింట్ల దూరంలో ఉంది. సోమవారం నాటి ముగింపు 25,044.65తో పోలిస్తే నిఫ్టీ 25,337.80 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. మార్కెట్లలో భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ 2.18 శాతం తగ్గి 17.04 స్థాయికి చేరింది.
పతనమైన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం భారత మార్కెట్లకు ప్రధానంగా కలిసొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 92.42 డాలర్లకు తగ్గింది. సోమవారం ఇది 96.93 డాలర్లుగా నమోదైంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 86.55 డాలర్ల వద్ద కొనసాగింది. భారత్ ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశం కావడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్ సెంటిమెంట్‌కు సానుకూలంగా మారింది. మరోవైపు ఆసియా మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది. తైవాన్ సూచీ 2.09 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.47 శాతం, జపాన్ నిక్కీ 0.80 శాతం లాభపడ్డాయి. మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసినప్పటికీ, అక్కడి విక్స్ సూచీ 2.31 శాతం తగ్గి 19.46 స్థాయికి చేరడం గమనార్హం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kondagattu | కొండగట్టులో చెక్కతో చేసిన అంజన్న విగ్రహం..
- ●Karthika Masam | హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర మాసం.. ఒక్క దీపంతోనే అనంత పుణ్యఫలం!
- ●Dasyam Vinay Bhaskar | న్యాయం చేయండి అని అడిగితే.. అర్ధరాత్రి అరెస్టులా..?
- ●Dense Fog | పొగ మంచు ఎఫెక్ట్.. 86 వాహనాలు ఢీ.. 12 మంది మృతి
- ●Murder | ప్రియుడితో ఏకాంతంగా వివాహిత.. అది చూశాడని బాలుడి హత్య
- ●Cold Waves | వణికిస్తున్న చలి.. రానున్న మూడు రోజులు జర జాగ్రత్త..!

Kondagattu | కొండగట్టులో చెక్కతో చేసిన అంజన్న విగ్రహం..

Karthika Masam | హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర మాసం.. ఒక్క దీపంతోనే అనంత పుణ్యఫలం!

Dasyam Vinay Bhaskar | న్యాయం చేయండి అని అడిగితే.. అర్ధరాత్రి అరెస్టులా..?

Dense Fog | పొగ మంచు ఎఫెక్ట్.. 86 వాహనాలు ఢీ.. 12 మంది మృతి






