త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు

reen India Challenge | ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ వైద్యులు డాక్ట‌ర్ చెన్నాడి జ‌గ‌న్మోహ‌న్ రావు ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో (Green India Challenge) పాల్గొన్న ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లోని చెన్నాటి ద‌వాఖాన ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ను నాటారు.

G

Telangana | Published On Oct 29, 2026, 10.48 am IST

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు
Advertisement

Green India Challenge | త్రినేత్ర న్యూస్‌: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ వైద్యులు డాక్ట‌ర్ చెన్నాడి జ‌గ‌న్మోహ‌న్ రావు ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో (Green India Challenge) పాల్గొన్న ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లోని చెన్నాటి ద‌వాఖాన ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ను నాటారు. అనంత‌రం డాక్ట‌ర్ చెన్నాడి జ‌గ‌న్మోహ‌న్ రావు (Dr Channadi Jagan Mohan Rao) మాట్లాడుతూ.. మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్క నాటడం సంతోషంగా ఉందన్నారు.

పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇద‌ని చెప్పారు. భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలంటే ఇప్పటి నుంచే విరివిగా మొక్కలు నాటాల‌ని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ స‌భ్యుడు కమల్ గౌడ్, ఉప సర్పంచ్ ఏడాపెల్లి తిరుపతి, ఏం డి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement