త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | చిక్కుల్లో ప‌డ్డ ర‌ణ‌వీర్‌సింగ్ – న‌ల‌భై కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందేనా?

డాన్ 3 మూవీ నుంచి ర‌ణ‌వీర్‌సింగ్ త‌ప్పుకోవ‌డం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ర‌ణ‌వీర్‌సింగ్ వ‌ల్ల త‌మ‌కు న‌ల‌భై కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని, ఆ న‌ష్టాన్ని హీరోనే భ‌రించాల‌ని నిర్మాణ సంస్థ డిమాండ్ చేస్తోంద‌ట‌.

N

News | Published On Feb 10, 2026, 3.51 pm IST

Ranveer Singh | చిక్కుల్లో ప‌డ్డ ర‌ణ‌వీర్‌సింగ్ – న‌ల‌భై కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందేనా?
Advertisement

Ranveer Singh |  ధురంధ‌ర్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్ చిక్కుల్లో ప‌డ్డారు. కొత్త సినిమా ఒప్పుకొని...త‌ప్పుకున్నందుకు అత‌డు భారీగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. బాలీవుడ్‌లో డాన్ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌గా నిలిచింది. డాన్ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాశాయి. మొద‌టి పార్ట్‌లో అమితాబ్‌బ‌చ్చ‌న్ డాన్‌గా క‌నిపించ‌గా...మిగిలిన రెండు పార్ట్‌ల‌లో డాన్ రోల్‌ను షారుఖ్‌ఖాన్ చేశారు. డాన్ ఫ్రాంచైజ్‌లో డాన్ 3 పేరుతో నాలుగో పార్ట్ తెర‌కెక్కుతోంది.

ర‌ణ‌వీర్‌సింగ్ హీరో...

డాన్ 3లో హీరోగా షారుఖ్‌ఖాన్‌ను కాద‌ని ర‌ణ‌వీర్‌సింగ్‌ను మేక‌ర్స్ సెలెక్ట్ చేశారు. డాన్‌, డాన్ 2 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఫ‌ర్హాన్ అక్త‌ర్ ...డాన్ 3ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి ఫ‌ర్హాన్ అక్త‌ర్ డాన్ 3 క‌థ‌ను రెడీ చేశారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంప్లీట్ అయ్యాయి. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. స‌డెన్‌గా ర‌ణ‌వీర్‌సింగ్ ఈ సినిమా నుంచి త‌ప్పుకొని మేక‌ర్స్‌కు పెద్ద షాకిచ్చాడు.

న‌ల‌భై కోట్లు ఖ‌ర్చు...

ర‌ణ‌వీర్‌సింగ్ నిర్ణ‌యంపై ఫ‌ర్హాన్ అక్త‌ర్‌తో పాటు నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్లు స‌మాచారం. డాన్ 3 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల కోసం తాము న‌ల‌భై కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చుచేశామ‌ని , ర‌ణ‌వీర్‌సింగ్ త‌ప్పుకోవ‌డంతో త‌మ‌కు చాలా న‌ష్టం వాటిల్లింద‌ని నిర్మాణ సంస్థ ఆరోపిస్తుంది. ఆ న‌ష్టాన్ని ర‌ణ‌వీర్‌సింగ్ భ‌రించాల‌ని, ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నందుకుగాను త‌మ‌కు న‌ల‌భై కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తోంద‌ట‌. ర‌ణ‌వీర్‌సింగ్ సినిమాను అంగీక‌రించిన త‌ర్వాతే తాము ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు ఎక్సెల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చెబుతోంది.

క‌థ న‌చ్చ‌లేదు...

ర‌ణ‌వీర్‌సింగ్ వాద‌న మ‌రోలా ఉంది. ఫ‌ర్హాన్ అక్త‌ర్ చెప్పిన క‌థ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేశాన‌ని ర‌ణ‌వీర్‌సింగ్ చెబుతోన్న‌ట్లు స‌మాచారం. డాన్ 3 క‌థ‌తో పాటు హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌కు సంబంధించి తాను కొన్ని మార్పులు సూచించాన‌ని, ఆ మార్పులు చేయ‌డానికి మేక‌ర్స్ ఒప్పుకోక‌పోవ‌డంతోనే డాన్ 3 నుంచి త‌ప్పుకున్న‌ట్లు ర‌ణ‌వీర్‌సింగ్ అంటున్నారు. తొలుత ఫ‌ర్హాన్ అక్త‌ర్ చెప్పిన క‌థ‌కు...ఫైన‌ల్‌గా రెడీ అయిన స్క్రిప్ట్‌కు అస‌లు సంబంధ‌మే లేద‌న్న‌ది ర‌ణ‌వీర్‌సింగ్ వాద‌న‌.

ప్రొడ్యూస‌ర్ గిల్డ్‌...

డాన్ 3 వివాదం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ధురంధ‌ర్ హిట్‌తోనే ర‌ణ‌వీర్‌సింగ్ మారిపోయాడ‌ని, నిర్మాత‌ల ముందు చాలా డిమాండ్లు పెడుతోన్నాడ‌ని కొంద‌రు అంటున్నారు. రెమ్యూన‌రేష‌న్ కూడా పెంచేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. డాన్ 3 నుంచి ర‌ణ‌వీర్‌సింగ్ త‌ప్పుకోవ‌డానికి త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ కూడా కార‌ణ‌మై ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌ర‌గుతోంది.
కాగా ర‌ణ‌వీర్‌సింగ్‌, డాన్ 3 నిర్మాత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. డాన్ 3 నుంచి ర‌ణ‌వీర్‌సింగ్ త‌ప్పుకోవ‌డంతో తిరిగి షారుఖ్‌ఖాన్‌తోనే ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని ప‌ర్హాన్ అక్త‌ర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement