FIFA 2026 | ఇంగ్లండ్ టూ లేట్..!
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్-ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచులో గోల్స్ వర్షం కురిసింది. బ్రిటీష్ జట్టు నాలుగు రోజుల కిందటే ఇదే ఆటతీరును ఆడి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- ఫ్రాన్స్‌పై చెలరేగిన జట్టు
- 4-6 తేడాతో ఘన విజయం
- ఫిఫా ప్రపంచకప్‌లో మూడోస్థానంలో ఇంగ్లండ్
- బుకాయో సాకా హ్యాట్రిక్
- కిలియన్ ఎంబాపే ప్రపంచరికార్డు
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్-ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచులో గోల్స్ వర్షం కురిసింది. బ్రిటీష్ జట్టు నాలుగు రోజుల కిందటే ఇదే ఆటతీరును ఆడి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో ఒక గోల్ ఆధిక్యంలో డిఫెన్స్‌కు పోయి మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు టోర్నీలో అత్యంత బలమైన జట్టుగా నిలిచిన ఫ్రాన్స్ సైతం సెమీస్‌లో స్పెయిన్ ముందు తేలిపోయింది. ఫలితంగా ప్రపంచకప్ ఫైనల్లో తలపడాల్సిన ఈ రెండు దిగ్గజ జట్లు ఆదివారం ఫైనల్‌కు బదులుగా మూడో స్థానం కోసం మయామిలో మూడోస్థానం కోసం పోటీపడ్డాయి. సాధారణంగా మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌ను ఓ లాంఛనంగానే భావిస్తారు. ఫైనల్‌కు చేరలేకపోయిన నిరాశలో ఆటగాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఇంగ్లండ్, ఫ్రాన్స్ మాత్రం ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేశాయి. అభిమానులు చాలాకాలం గుర్తుంచుకునేలా 10 గోల్స్‌తో ఉత్కంఠభరిత పోరును ఉత్కంఠ భరితంగా మార్చేశాయి.
తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆధిపత్యం
సెమీఫైనల్ పరాజయంపై పేరుకుపోయిన అసంతృప్తినంతా మైదానంలో చూపించాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావించినట్లుగా మైదానంలో వారి ఆటతీరు కనిపించింది. మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషానికే డెక్లాన్ రైస్ అద్భుతమైన షాట్‌తో తొలి గోల్ వేశాడు. అనంతరం రైస్ కార్నర్‌ను ఎజ్రీ కొన్సా హెడ్డర్‌తో గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత బుకాయో సాకా తనదైన శైలిలో చెలరేగాడు. తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్ నమోదు చేసి ఇంగ్లండ్‌ను 4-0 ఆధిక్యంలో నిలిపాడు. అప్పటివరకు టోర్నీలో సమతూకంగా కనిపించిన ఫ్రాన్స్ పూర్తిగా తడబడిపోయింది.
ఫ్రాన్స్ చెలరేగినా.. ఫలితం శూన్యం..
మ్యాచ్ అక్కడితో ముగిసిపోతుందనుకున్న సమయంలో రెండో అర్ధభాగంలో ఫ్రాన్స్ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. బ్రాడ్లీ బార్కోలా తొలి గోల్‌తో ఆశలు రేకెత్తించగా.. ఆ తర్వాత కలియన్ ఎంబాపే వరుసగా రెండు గోల్స్ చేసి జట్టును మళ్లీ పోటీలోకి తీసుకొచ్చాడు. ఉస్మాన్ డెంబెలే మరో గోల్ జోడించడంతో స్కోరు ఒక్కసారిగా 5-4కు చేరింది. సెమీస్‌లో అర్జెంటీనాపై జరిగినట్లే మరోసారి ఇంగ్లండ్ చేతిలో మ్యాచ్ జారిపోతుందేమో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈసారి ఇంగ్లండ్ అలాంటి తప్పు చేయలేదు. చివర్లో సాకా పెనాల్టీని గోల్‌గా మలిచి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అదనపు సమయంలో జూడ్ బెల్లింగ్‌హామ్ మరో గోల్ చేయడంతో ఇంగ్లండ్ 6-4 తేడాతో ఘన విజయం సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అర్జెంటీనాతో సెమీఫైనల్లో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత వెనక్కి తగ్గి మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్.. ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన ఆటను ప్రదర్శించింది. తొలి నిమిషం నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ దూకుడుగా ఆడింది. ఫ్రాన్స్ మాత్రం స్పెయిన్‌తో జరిగిన సెమీఫైనల్లో చేసిన తప్పులను పునరావృతం చేసింది. రెండో భాగంలోనే జట్టు అసలు సిసలైన పోరాటం చేసింది. అయితే, అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
సాకా హ్యాట్రిక్.. ఎంబాప్పే ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ విజయంలో బుకాయో సాకా కీల పాత్ర పోషించాడు. ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన నాలుగో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు సర్ జెఫ్ హర్స్ట్, గ్యారీ లినెకర్, హ్యారీ కేన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఫ్రాన్స్ డిఫెన్ను తన వేగంతో ఇబ్బంది పెట్టిన సాకా.. పెనాల్టీ ద్వారా హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. మరోవైపు కైలియన్ ఎంబాప్పే కూడా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌తో ప్రపంచకప్‌లో మొత్తం గోల్స్ సంఖ్య 22కి పెరిగాయి. దీంతో లియోనెల్ మెస్సీ (21) పేరిట ఉన్న రికార్డును అధిగమించి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో మొత్తం 10 గోల్స్‌తో మరోసారి గోల్డెన్ బూట్ రేసులో నిలిచాడు.
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
- ●Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
- ●NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..

NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం

Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్



