త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | జ‌గిత్యాల కేసీఆర్ సభ అంటే పైస‌లు విడుద‌ల.. రైతుబంధు రావాలంటే మ‌ళ్లీ కేసీఆర్ స‌భ పెట్టాల్నా?: జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్‌

KCR | ఎరువు కావాలంటే యాప్ రైతుబంధు కోసం ఎదురుచూడాలి. జ‌గిత్యాల (Jagtial) కేసీఆర్ (KCR) స‌భ అంటే పైస‌లు విడుద‌ల చేసిర్రు. రైతుబంధు (Raithu bandhu) రావాలంటే మ‌ళ్లీ కేసీఆర్ స‌భ (meeting) పెట్టాల్నా? ఇది ప్ర‌భుత్వ‌మా? 75 వేల కోట్లు రైతుల‌కు ఇచ్చాం. ఇప్పుడు ఏం రోగం వ‌చ్చింది అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

S

News | Published On Apr 20, 2026, 9.34 pm IST

KCR | జ‌గిత్యాల కేసీఆర్ సభ అంటే పైస‌లు విడుద‌ల.. రైతుబంధు రావాలంటే మ‌ళ్లీ కేసీఆర్ స‌భ పెట్టాల్నా?: జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నాకు బాధ్య‌త అప్ప‌జెప్పారు.. పని మొద‌లుపెట్టాలి.. ఆర్థికం తెల్వ‌దు.. చాలా చాలా కిష్ట‌మైన ప‌రిస్థితులు.. ఎక్క‌డిక‌క్క‌డ భయంక‌ర‌మైన ఇబ్బందులు.. ఇదే జిల్లాలో చొప్ప‌దండిలో జీఆర్ రెడ్డి ఆర్థిక శాస్త్ర‌వేత్త‌.. ఆయ‌న‌కు ఫోన్ చేసి.. మీరు రావాల‌ని పిలిపించుకుని ఎజెండాతో బ‌య‌ల్దేరాం. చెరువుల‌ను నాశ‌నం చేశారు. 80 వేల చెరువులు ఉండే.. మొత్తం ఆంధ్రా పాల‌కులు క‌బ్జా పెట్టారు. అన్నం పెట్టిన కాక‌తీయ రాజుల పేరుతో మిష‌న్ కాక‌తీయ చేప‌ట్టాం. రైతులు ఉద్య‌మంలాగా చేశారు. మ‌ట్టి సార‌వంతంగా ఉంటుంద‌ని ల‌క్ష‌ల ట్రాక్ట‌ర్ల మ‌ట్టి తీసుకుపోయారు. అక్క‌డ్నుంచి మొద‌ల‌పెట్టిన ప్ర‌స్థానం ప‌దేండ్లు ఎన్నో చేశాం. ఎరువు కావాలంటే యాప్ రైతుబంధు కోసం ఎదురుచూడాలి. జ‌గిత్యాల (Jagtial) కేసీఆర్ (KCR) స‌భ అంటే పైస‌లు విడుద‌ల చేసిర్రు. రైతుబంధు (Raithu bandhu) రావాలంటే మ‌ళ్లీ కేసీఆర్ స‌భ (meeting) పెట్టాల్నా? ఇది ప్ర‌భుత్వ‌మా? 75 వేల కోట్లు రైతుల‌కు ఇచ్చాం. ఇప్పుడు ఏం రోగం వ‌చ్చింది అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఉట్టి మాట‌లు మాట్లాడడం కాకుండా.. గ‌ప్పాలు కొట్ట‌కుండా.. స‌భ‌లో నిల‌వ‌డి ఈ రాష్ట్ర చ‌రిత్ర‌లో సీఎం ఈ ఐదేండ్ల‌లో మిష‌న్ భ‌గీర‌థ పూర్తి చేసి న‌ల్లా పెట్టి మంచీనీళ్లు ఇవ్వ‌క‌పోతే మ‌ళ్లీ నిల‌బ‌డం అని చెప్పిన‌ సీఎం ఎవ‌రైనా ఉన్నారా? నేను అసెంబ్లీలో చెప్పిన‌ట్టు 100 శాతం తండాలు మారుమూల ప‌ల్లెల‌కు నీళ్లు ఇచ్చాం. నీరు పుష్క‌లంగా వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు ఏం రోగం పుట్టింది. ఎందుకు నీళ్లు వ‌స్త‌లేవు? మ‌రి ఏం చేయాలి.. లాగులు ప‌గిలేదాకా చంపాలి. మంచి మాట‌కు కాక‌పోతే ఏం జేస్త‌రు. క‌ట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి.. ఐదేండ్లు న‌డిచింది క‌దా.. ఏం బీమారి వ‌చ్చింది? ఇంతింత పొడువు అడ్డం పొడ‌వు మాట్లాడుతారా? కేసీఆర్ చావాలి అని అంటే.. నీవు వెయ్యి జ‌న్మ‌లు ఎత్తినా నేను చావ కొడుకా.. ఉట్టి మీద దాచిపెట్టిర్రు. ఎండిపోయిన చేప‌లు వ‌గురులు పెట్టేటోళ్లు.. పిల్లి శాపం పెట్టేది అందాల‌ని తెగాలి, కింద‌ ప‌డాలి అని.. పిల్లి శాపానికి ఉట్టి తెగుదత‌దా..? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

ఈ వెధ‌వ‌లు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చ‌స్త‌డా మీ దీవెనలు ఆశీర్వ‌చ‌నాలు ఉంటే.. నాకు కూడా 75 వ‌చ్చాయి.. నేను ఒక్క‌టే చెబుతున్నా.. ఇక్క‌డ ద‌రిద్రం పోయేదాకా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇది మా తెలంగాణ గ‌ర్వంగా బ‌తుకుతాం. సంతోషంగా ఉండేదాకా సేవ చేయాల్సిందే చివ‌రి శ్వాస దాకా చేయాల్సిందే.. త‌ప్ప‌నే త‌ప్ప‌దు. ఇవాళ 50 ఏండ్లే మీకు. యువ‌కుడిలా దూసుకుపోదాం. తెలంగాణ ఎట్ల మంచిగ కాదో చూసుకుందాం.

పొద‌రిల్లు చేశాం. క‌రెంట్ ఉండేనా? కేసీఆర్ ఉన్న‌న్ని రోజులు మంచిగ ఉండే మ‌ళ్లీ ఇప్పుడు ఏం రోగం వ‌చ్చింది. క‌రెంట్ కాకి ఎత్తుకుపోయిందా? ఆనాడు 7 వేల మెగావాట్లు ఉంటే.. ఏడాదిలో మంచిగా చేసి 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చాం. రిపేర్ వ‌స్తే త‌ప్ప పోకుండే. యాదాద్రి, భ‌ద్రాద్రి కొత్త‌గా జ‌న‌రేంటింట్ స్టేష‌న్ పెట్టాం. ఈ ద‌రిద్రుల‌కు రాజ్యం అప్ప‌జెప్పేముందు 20 వేల మెగావాట్ల‌కు తీసుకెళ్లాం. ఏం రోగం వ‌చ్చింది ఎందుకు ఇబ్బంది పెడుతున్న‌రు? పొలాలు ఎండుతున్నాయి. జ‌నం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ క‌లుగుతుంది? ఈ జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య బ‌తుకుదెరువు స‌మ‌స్య ఎందుకొచ్చింది? దెబ్బ‌తింట‌ర‌ని చెప్పినా.. ఇప్పుడు ఏమైంది.. ఏం జ‌రుగుతుంది.. వీళ్లు గెలిస్తే.. గుండెల్లో త‌డి లేదు.. రైతుబంధుకు రాంరాం.. ద‌ళిత బంధుకు జైభీం.

ట్యాగ్స్:

Advertisement
Advertisement