Public Toilets to Day Care Centers | ‘పబ్లిక్ టాయిలెట్స్’ టు ‘డే కేర్ సెంటర్స్’.. హైదరాబాదీలకు ఏం కావాలి..?
Public Toilets to Day Care Centers | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక(99 రోజుల ప్రణాళిక) పేరిట కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Public Toilets to Day Care Centers | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక(99 రోజుల ప్రణాళిక) పేరిట కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ క్యూఆర్ కోడ్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో మీరు ఏం కోరుకుంటున్నారు అని నగర ప్రజలను జీహెచ్ఎంసీ ప్రశ్నిస్తోంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. నగరంలో మీకు కావాల్సిన సదుపాయాల గురించి మీ అభిప్రాయం తెలియజేయండి అని నగర ప్రజలకు విన్నవిస్తోంది.
పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, ప్లే గ్రౌండ్లు, సీనియర్ సిటిజెన్ డే కేర్ సెంటర్లపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని జీహెచ్ఎంసీ కోరింది. నగర ప్రజలు తమ సూచనలను తక్షణమే సమర్పించేందుకు వీలుగా వివిధ ప్రదేశాలలో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సేకరించిన అభిప్రాయాలను సంబంధిత శాఖలకు పంపి, దానికనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మార్చిలో ప్రారంభమైన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఈ ఏడాది జూన్ వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, మండల, పట్టణ స్థాయిల్లో అనేక కార్యక్రమాలు చేపట్టింది. సమస్యలను గుర్తించి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకుంది.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలలో, పరిపాలనను మరింత బాధ్యతాయుతంగా, పౌరుడి కేంద్రీకృతంగా మార్చాలనే లక్ష్యానికి, తాజాగా అభిప్రాయ సేకరణను ప్రారంభించింది. పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలుపాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
Citizen Feedback for Improved Citizen Services 📋
As part of Praja Palana – Pragati Pranalika (99 Days Action Plan), GHMC is enhancing citizen-centric service delivery by actively collecting feedback on key public utilities.
Feedback is being gathered for:
🚻 Public Toilets
🏢… pic.twitter.com/IDhRVPsXZp— GHMC (@GHMCOnline) April 24, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






