Deepika Padukone | ఆ హీరో కంటే నా సక్సెస్ రేటు ఎక్కువ – స్పిరిట్ వివాదం వేళ దీపికా పడుకోణ్ కామెంట్స్ వైరల్
ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పడుకోణ్‌ను డైరెక్టర్ సందీప్ వంగా పక్కనపెట్టి ఏడాది దాటిపోయింది. అయినా ఈ వివాదం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. తాజాగా ఏడేళ్ల క్రితం ఓ వేడుకలో దీపికా పడుకోణ్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పిరిట్‌తో ఈ వీడియోను లింక్ చేస్తూ నెటిజన్లు, పోస్ట్‌లు పెడుతున్నారు.
Deepika Padukone | ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పిరిట్ నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణ్ తప్పుకొని ఏడాది దాటిపోయింది. దీపికా పెట్టిన కండీషన్లు, డిమాండ్లతో హర్టయిన సందీప్ వంగా ఆమెను తీసేసి ఆ ప్లేస్‌లో త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఇది జరిగి చాలా రోజులే అయినా వివాదం మాత్రం చల్లారడం లేదు. ఇప్పటికీ నెటిజన్లతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది దీపికా పడుకోణ్‌ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై దీపికా తగ్గడం లేదు. ధీటుగా బదులిస్తోంది.
రొమాంచకం ప్రమోషన్స్...
ప్రస్తుతం సందీప్ వంగా తన సోదరుడు ప్రణయ్ వంగాతో కలిసి రొమాంచకం పేరుతో ఓ చిన్న సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 4న ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. రొమాంచకం ప్రమోషన్స్‌లో దీపికా పడుకోణ్ స్పిరిట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై ప్రణయ్ వంగా ఆసక్తికర కామెంట్లు చేశారు. రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో పది శాతం వాటా కావాలని దీపికా డిమాండ్ చేసిందని, పని గంటల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిందని అన్నారు. అతడి వ్యాఖ్యలతో స్పిరిట్ వివాదం మళ్లీ రాజుకుంది. నెటిజన్లలో చాలా మంది దీపికాను ట్రోల్ చేస్తుండగా...కొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ పరంగా ఉన్న అంతరాల గురించి ఏడేళ్ల క్రితం దీపికా పడుకోణ్ మాట్లాడిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
2019లో...
2019లో స్టార్ హీరోతో చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ మూవీ నుంచి దీపికా తప్పుకుంది. అందుకు గల కారణాలను వివరిస్తూ "ఓ స్టార్ హీరోకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తూ నిర్మాణ సంస్థ సినిమాను అనౌన్స్‌చేసింది. అందులో హీరోయిన్‌గా నన్ను అప్రోచ్ అయ్యారు. సదరు స్టార్ హీరో కంటే నాకే ఎక్కువ సక్సెస్ రేటు. అది దృష్టిలో పెట్టుకొని నా రెమ్యూనరేషన్‌ను మేకర్స్ చెప్పా. నాకున్న మార్కెట్ వాల్యూను బట్టే అడిగా. కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేదంటూ నన్ను కన్వీన్స్ చేయాలని నిర్మాతలు చూశారు. కానీ నేను కాంప్రమైజ్ కాలేదు. సినిమా చేయనని చెప్పా" అంటూ దీపికా కామెంట్స్ చేసింది.
స్పిరిట్‌తో లింక్...
ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్పిరిట్ గురించి దీపికా పడుకోణ్ ఈ కామెంట్లను చేసిందంటూ చెబుతూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ వీడియోలో దీపికా చేసినప కామెంట్లు కూడా స్పిరిట్ సినిమాకు తగ్గట్లుగానే ఉండటంతో నిజమేనని సినిమా లవర్స్ భావిస్తున్నారు.ప్రభాస్ స్పిరిట్‌తో పాటు కల్కి 2 సినిమాల నుంచి తప్పుకున్న దీపికా పడుకోణ్ అల్లు అర్జున్‌తో రాకా సినిమా చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
సెప్టెంబర్ 4, 2026

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ – విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



