త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddiraju Ravichandra | హ‌రీశ్‌రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై కాంగ్రెస్ పిచ్చి ప్రేలాప‌న‌లు: ఎంపీ వ‌ద్దిరాజు

MP Vaddiraju Ravichandra | బీఆర్ఎస్(BRS) లో ఏదో కలకలం జరగాలని కాంగ్రెస్ నేతలు గుంత కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నార‌ని, వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవ‌ని ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర అన్నారు. హ‌రీశ్‌రావు (Harish Rao) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌(Delhi tour)పై ఇకనైనా కాంగ్రెస్ నేతలు, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హిత‌వు ప‌లికారు.

S

News | Published On Apr 20, 2026, 4.46 pm IST

MP Vaddiraju Ravichandra | హ‌రీశ్‌రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై కాంగ్రెస్ పిచ్చి ప్రేలాప‌న‌లు: ఎంపీ వ‌ద్దిరాజు
Advertisement

MP Vaddiraju Ravichandra: త్రినేత్ర‌.న్యూస్: బీఆర్ఎస్(BRS) లో ఏదో కలకలం జరగాలని కాంగ్రెస్ నేతలు గుంత కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నార‌ని, వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవ‌ని ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర అన్నారు. హ‌రీశ్‌రావు (Harish Rao) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌(Delhi tour)పై ఇకనైనా కాంగ్రెస్ నేతలు, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హిత‌వు ప‌లికారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ కలిసి ఢిల్లీ వచ్చాం. ఢిల్లీ పర్యటనకు సంబంధించి హరీశ్‌ రావుపై కాంగ్రెస్ నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పొద్దున కాంగ్రెస్ తరఫున మాట్లాడి రాత్రి బీజేపీ నేతలతో చర్చలు జరపడం రేవంత్ రెడ్డికి అలవాటే.
పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంద‌నే సామెత గుర్తొస్తుంది. కాంగ్రెస్ నేతలందరూ రేవంత్ లాగానే ఉంటారనిపిస్తోంది అని వ‌ద్దిరాజు ఫైరయ్యారు.

Advertisement
Advertisement