త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Election Results | నందికొండ‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్‌.. గ‌డ్డ‌పోతారం మున్సిపాలిపై గులాబీ జెండా

Municipal Election Results | మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు (Municipal Election Results) కొన‌సాగుతున్న‌ది. పుర‌పాలిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గ‌డ్డ‌పోతారం మున్సిపాలిటీతో గులాబీ జెండా ఎగిరింది.

G

News | Published On Feb 13, 2026, 10.22 am IST

Municipal Election Results | నందికొండ‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్‌.. గ‌డ్డ‌పోతారం మున్సిపాలిపై గులాబీ జెండా
Advertisement

Municipal Election Results | మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు (Municipal Election Results) కొన‌సాగుతున్న‌ది. పుర‌పాలిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గ‌డ్డ‌పోతారం మున్సిపాలిటీతో గులాబీ జెండా ఎగిరింది. మున్సిపాలిటీలోని మూడింట రెండొంతులకు పైగా వార్డుల‌ను బీఆర్‌ఎస్ గెలుచుకున్నది. పుర‌పాలిక‌లోని మొత్తం 18 వార్డుల్లో 14 వార్డుల్లో కారుపార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. మిగిలిన నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ 3, ఇతరులు 1 వార్డు ద‌క్కించుకున్నారు.

ఇక న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. నందికొడ‌లోని మొత్తం 12 వార్డుల్లో 11 చోట్ల అధికార పార్టీ విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో స‌రిపెట్టుకున్న‌ది. హాలియాలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ స‌గానికిపైగా సీట్లు సాధించింది. ఇప్ప‌టికే 8 వార్డుల్లో విజ‌యం సాధించింది.

Advertisement
Advertisement