Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?
ఎల్ నినో నేపథ్యంలో ఎండిపోయిన పంటలకు కరువు సాయం అందిస్తూనే.. పంట వేసినా, వేయకున్నా రైతులందరికీ యాసంగి (రబీ) సీజన్ లో రైతులందరికీ రైతు భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నది. అంతేకాదు వరి, పత్తి పంటలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర కన్నా ఇంకాస్తా అధిక ధరలు ప్రకటించే ప్రతిపాదనలను కూడా పరిశీలించనున్నది.
నవంబరు 9న హకీంపేటలో జరిగే సభలో ..రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటనలు చేయనున్నారా?
సంక్షిప్త సారాంశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లోని హకీంపేటలో శనివారం (నవంబరు 7) నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. చివరి రోజైన సోమవారం నాడు దాదాపు 50 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందే రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అందరికీ రైతు భరోసా, కరువు సాయం, పంటలకు మద్దతు ధరలపై కీలకమైన ప్రకటనలు చేయనున్నట్టు సమాచారం.
అటు కరువు సాయం
ఇటు రైతు భరోసా
పంట వేసినా..వేయకున్నా
రైతులందరికీ పెట్టుబడి సాయం
ధాన్యం మద్దతు ధర పెంచే అవకాశం
ఎల్ నినో నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
మంత్రులు, అధికారులతో చర్చలు
9న కొడంగల్ రైతు సభలో.. ప్రకటన చేసే అవకాశం
త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించనున్నది. ఎల్ నినో (El Niño) నేపథ్యంలో ఎండిపోయిన పంటలకు కరువు సాయం అందిస్తూనే.. పంట వేసినా, వేయకున్నా రైతులందరికీ యాసంగి (రబీ Rabi season) సీజన్ లో రైతులందరికీ రైతు భరోసా (Rytu Bharosa) అందించే యోచన చేస్తున్నది. అంతేకాదు వరి (paddy), పత్తి (cotton) పంటలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర (Minimum support price) కన్నా ఇంకాస్తా అధిక ధరలు ప్రకటించే ప్రతిపాదనలను కూడా పరిశీలించనున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
నవంబరు 9 (సోమవారం) నాడు కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
సగానికి పైగా మండలాల్లో దుర్భిక్షం(Drought)
రాష్ట్రంలో ఉన్న 621 మండలాలకు గాను 365 మండలాల్లో కరువు (Drought) నెలకొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 111 మండలాల్లో తీవ్రంగా 254 మండలాల్లో మధ్యస్థంగా ఉన్నట్లు వెల్లడించింది. సూర్యాపేట, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, హనుమ కొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 139.28 లక్షల ఎకరాల్లో జరగాల్సిన సాగు .. 126 లక్షల ఎకరాలకు పడిపోయింది. గత ఏడాది 69.19 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా ఈ సారి కేవలం 57 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద 20వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
కరువు సాయం..రైతు భరోసా..మద్దతు ధర పెంపు
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పూర్తిగా అండగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు నవంబరు 5న జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్వల్ప చర్చ జరిగింది. పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే స్వల్ప మొత్తంలో రైతులకు కరువు సాయం అందించారు. మహారాష్ట్రలో దీపావళికి ముందే 5 వేల రూపాయలు కరువు బాధిత రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. కర్ణాటకలోనూ ప్రభుత్వం 5 వేల రూపాయలు సాయం ప్రకటించి.. తొలి దఫా లో 2,500 విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు రాష్ట్రాలను మించి రైతులకు సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రైతులను మూడు విధాలుగా ఆదుకోవాలని భావిస్తున్నది. మొదటిది..కేంద్రం నుంచి అందే సాయానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు జోడించి రైతులకు సంతృప్తి కరంగా కరువు సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెండోది.. వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన ప్రకారం.. వరి, పత్తి, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు ఈ సారి మద్దతు ధర పెంచాలని భావిస్తున్నది. మూడోది.. పంట వేసినా, వేయకున్నా రైతులందరికీ రైతు భరోసా అందించాలని ప్రతిపాదించినట్టు సమాచారం.
హకీం పేట సభలో ప్రకటన?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లోని హకీంపేటలో శనివారం (నవంబరు 7) నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. చివరి రోజైన సోమవారం నాడు దాదాపు 50 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందే రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అందరికీ రైతు భరోసా, కరువు సాయం, పంటలకు మద్దతు ధరలపై కీలకమైన ప్రకటనలు చేయనున్నట్టు సమాచారం.
సంబంధిత వార్తలు

Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
నవంబర్ 6, 2026

Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినందనలు
నవంబర్ 6, 2026

Indiramma Jeevitha Bheema | రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల ఉచిత బీమా.. నవంబర్ 20 నుంచి దరఖాస్తులు షురూ
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- ●Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
- ●Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ
- ●Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
- ●MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్

CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్

Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం

Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ

Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?



