త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Jeevitha Bheema | రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల ఉచిత బీమా.. న‌వంబ‌ర్ 20 నుంచి ద‌ర‌ఖాస్తులు షురూ

Indiramma Jeevitha Bheema | ప్ర‌జా ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త వినిపించింది. దీపావ‌ళి పండుగ వేళ రేవంత్ స‌ర్కార్ అదిరిపోయే గిఫ్ట్ అందించేందుకు సిద్ధ‌మైంది. రాష్ట్రంలోని రేష‌న్‌కార్డుదారుల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఉచిత బీమా క‌ల్పించాల‌ని సంక‌ల్పించింది.

S

Telangana | Published On Nov 6, 2026, 2.52 pm IST

Indiramma Jeevitha Bheema | రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల ఉచిత బీమా.. న‌వంబ‌ర్ 20 నుంచి ద‌ర‌ఖాస్తులు షురూ
Advertisement

Indiramma Jeevitha Bheema | త్రినేత్ర న్యూస్ : ప్ర‌జా ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త వినిపించింది. దీపావ‌ళి పండుగ వేళ రేవంత్ స‌ర్కార్ అదిరిపోయే గిఫ్ట్ అందించేందుకు సిద్ధ‌మైంది. రాష్ట్రంలోని రేష‌న్‌కార్డుదారుల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఉచిత బీమా క‌ల్పించాల‌ని సంక‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే ఈ నెల 19న మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఇందిర‌మ్మ కుటుంబ జీవిత బీమా( Indiramma Jeevitha Bheema ) ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని రేవంత్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ పథకం అమ‌ల్లోకి వ‌స్తే కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబసభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్మును ప్ర‌భుత్వం అందించ‌నుంది. ఏ కారణంతో మరణించినా ఈ బీమా సొమ్ము అందుతుంది. ఇందుకోసం ఇన్యూరెన్స్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్ కార్డు ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా చెల్లిస్తుంది.

న‌వంబ‌ర్ 20 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

ఇందిరమ్మ బీమా పథకం కోసం నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తాయి. ఎమ్మార్వోలు, గ్రామ పంచాయతీలు కార్యదర్శులు వీటిని సేకరించి అర్హులైనవారికి గుర్తించి ఈ పథకంలో లబ్దిదారులుగా చేర్చుతారు.

Advertisement
Advertisement