Indigo | అధిక ధరల వసూలుపై కేంద్రం సీరియస్… ధరల కట్టడి
ఇండిగో (Indigo) సంక్షోభం నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థలు (Airlines) వసూలు చేస్తున్న అధిక ధరలు ప్రయాణికులకు భారంగా మారాయి. భారీగా ధరలు పెరగడంతో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం (Central Govt.) కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) సంక్షోభం నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థలు (Airlines) అధిక ధరలు వసూలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt.) సీరియస్ అయ్యింది. మరో మూడు రోజుల్లో విమానాలు పూర్తి స్థాయిలో నడుస్తాయని, అప్పటి వరకు ప్రయాణీకుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది. విమానాల టికెట్ల ధరలు పెంచకుండా పరిమితులు విధిస్తూ ఇతర విమానయాన సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది.
అదునుచూసి వీరబాదుడు బాదుతున్న ఇతర విమానయాన సంస్థలు
ఒకవైపు ఇండిగో (Indigo) విమానాలు రద్దవుతుండడంతో ఇదే అదునుగా ఇతర విమానయాన సంస్థలు బరితెగించి, ఇబ్బడిముబ్బడిగా టికెట్ ధరలు నిర్ణయించాయి. సాధారణ విమాన చార్జీతో పోలీస్తే కొన్ని రూట్లలో 20 రెట్లకు పైగా చార్జీలను పెంచి ప్రయాణీకుల నుంచి వసూలు చేశాయి. లండన్‌కు కనీస విమాన టికెట్ ధర దాదాపు రూ.30 వేలు ఉండగా, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధర రూ.80 వేలు ఉండడంపై ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నిబంధనలు ఇలా...
కిలోమీటర్ల ఆధారంగా గరిష్ఠ ధరలను నిర్ణయించింది.
500 కిలోమీటర్ల దూరానికి గరిష్ఠ ధర రూ.7,500
1000 కిలోమీటర్ల దూరానికి గరిష్ఠ ధర రూ.12,000
1500 కిలోమీటర్ల దూరానికి గరిష్ఠ ధర రూ.18,000
ఈ పరిమితులు బిజినెస్ క్లాస్ (business Class), రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సీఎస్) (RCS), ఉడాన్ (ఉడె దేశ్ కా ఆమ్ నాగరిక్) (UDAN) విమానాలకు వర్తించవని తెలిపింది.
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | ఎన్నికల కోసమే కేంద్రం చమురు ధరలు పెంచలే.. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసింది: ఉత్తమ్
మే 15, 2026

Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
మే 6, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



