త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OPS | పెన్ష‌న్ మా హ‌క్కు.. అంబేద్క‌ర్ వ‌ర్సిటీలో ఉద్యోగుల నిర‌స‌న

OPS | పెన్ష‌న్ విద్రోహ దినం సంద‌ర్భంగా ఓపీఎస్ కోసం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో ఉద్యోగులు నిర‌స‌న చేప‌ట్టారు. “పెన్షన్ మ హక్కు – భవిష్యత్ భద్రతకు హామీ!, ఐక్యమత్యమే మన బలం – పెన్షన్ సాధనే మన లక్ష్యం! అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.

S

Flash news | Published On Sep 1, 2026, 8.54 pm IST

OPS | పెన్ష‌న్ మా హ‌క్కు.. అంబేద్క‌ర్ వ‌ర్సిటీలో ఉద్యోగుల నిర‌స‌న
Advertisement

OPS | త్రినేత్ర‌.న్యూస్ : పెన్ష‌న్ విద్రోహ దినం సంద‌ర్భంగా ఓపీఎస్ కోసం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో ఉద్యోగులు నిర‌స‌న చేప‌ట్టారు. “పెన్షన్ మ హక్కు – భవిష్యత్ భద్రతకు హామీ!, ఐక్యమత్యమే మన బలం – పెన్షన్ సాధనే మన లక్ష్యం! అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.

తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం (TUNTIA), తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు “పెన్షన్ విద్రోహ దినం” సందర్బంగా మంగళవారం అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల సభ్యులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (CPS/NPS) రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేసి, భవిష్యత్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నిశ్చితమైన నెలవారీ పెన్షన్ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులు వారి కుటుంభ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరిగేలా హెల్త్ కార్డ్‌లు జారీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో తుంటీయ సెక్రటరీ జనరల్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, తుంటియా వర్కింగ్ ప్రెసిడెంట్ డా.యకేష్ దైడా, విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం సభ్యులు విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, కె. మంజుల, జి. జ్యోతీ శ్రీ, రజనికాంత్, మహమ్మద్ షబ్బీర్‌తో పాటు అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులు, ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement