త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Secretariat | తెలంగాణ స‌చివాలయాన్ని పేల్చేస్తాం – బెదిరింపు మెయిల్‌

Telangana Secretariat | తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యం (Telangana Secretariat), లోక్ భ‌వ‌న్ (Lok Bhavan)ల‌ను పేల్చేస్తామ‌ని (Bomb Threat) గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి బెదిరింపు మెయిల్ వ‌చ్చింది.

A

News | Published On Dec 9, 2025, 2.42 pm IST

Telangana Secretariat | తెలంగాణ స‌చివాలయాన్ని పేల్చేస్తాం – బెదిరింపు మెయిల్‌
Advertisement

Telangana Secretariat | తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) కార్యాల‌యం(స‌చివాల‌యం) (Telangana Secretariat), గ‌వ‌ర్న‌ర్ (Governor) కార్యాల‌యం (లోక్ భ‌వ‌న్‌) (Lok Bhavan) ల‌ను పేల్చేస్తామ‌ని (Bomb Threat) గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. ఈ మెయిల్ రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌ (Bomb Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) బృందాల‌తో ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టారు. ఎలాంటి అనుమానాస్ప‌ద వ‌స్తువులు ల‌భించ‌క‌పోవ‌డంతో ఊపిరిపీల్చ‌కున్నారు. ఖాన్ అనే పేరుతో తెలంగాణ సీఎంవో, లోక్ భ‌వ‌న్‌ను పేల్చివేయాల‌నే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని మెయిల్‌లో పేర్కొన్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. గ‌వ‌ర్న‌ర్ సీఎస్‌వో శ్రీ‌నివాస్ దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ఈమెయిల్ పంపిన వ్యక్తి వివరాలు, మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి బెదిరింపు మెయిల్స్, కాల్స్ ఇటీవల పెరిగిపోవడంతో లోక్ భవన్ సహా కీలక ప్రభుత్వ భవనాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement