Bakka Judson | భగీరథ్ రేవంత్ ఇంట్లోనే ఉన్నడు.. పోలీసులే రక్షిస్తున్నరు: కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్
Bakka Judson | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంట్లోనే ఉన్నాడని, తెలంగాణ పోలీసులే అతన్ని రక్షిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉన్న వ్యక్తిని పట్టుకోలేరా అని ప్రశ్నించారు.
- ఐపీఎస్ భార్యను చంపిన నిందితులను పుణే వెళ్లి 48 గంటల్లో పట్టుకున్నరు
- ఇక్కడే ఉన్న భగీరథ్‌ను పట్టుకోలేరా?
- నిందితుడు సీఎం రేవంత్ ఇంట్లో ఉన్నట్లు నాకు ఫోన్ వచ్చింది
- విచారణకు భగీరథ్ రాకపోగా అధికారులు కూడా రాలే
- కాలయాపన కోసమే సిట్ వేశారు
- ఎన్నికల్లో గెలిచాక ఆ అమ్మాయే ఈడ్చుకెళ్లి జైల్లో వేస్తది
- కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు
Bakka Judson త్రినేత్ర.న్యూస్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంట్లోనే ఉన్నాడని, తెలంగాణ పోలీసులే అతన్ని రక్షిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఐపీఎస్ భార్యను చంపితే పోలీసులు పుణే వెళ్లి 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారని.. అలాంటిది ఇక్కడ ఉన్న వ్యక్తిని పట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
అమ్మాయిని కౌరవుల్లా వేధిస్తున్నరు..
ఇవాళ ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల్లాగా వేధిస్తున్నారు. రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకుని కాపాడుతున్నాడు. గతంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీని వేధిస్తే ఆమె ఇంగ్లండ్ వెళ్లాక మమ్మల్ని వేశ్యల లాగా చూస్తున్నారని చెబితే అప్పుడు ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కాలయాపన కోసమే బండి భగీరథ్ పోక్సో కేసుపై సిట్ విచారణ వేశారు. బండి భగీరథ్‌ను విచారణకు రమ్మని చెప్పి ఆయన రాకపోగా, అసలు విచారణ అధికారులు కూడా రాలేదు అని అసహనం వ్యక్తం చేశారు.
మొన్న ప్రధాని మోదీ టూర్లో బండి సంజయ్ పేరు తీసేస్తే రేవంత్ రెడ్డి నీకు నేను ఉన్నా అని తీసుకుపోయాడు. బండి సంజయ్ కొడుకు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని నాకు నిన్న పొద్దున ఫోన్ వచ్చింది. బండి భగీరథ్ చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి రక్షణలో ఉన్నాడు. పోలీసులే అతడిని రక్షిస్తున్నారు అని జడ్సన్ ఆరోపించారు.
రేవంత్‌కు, బండి సంజయ్‌కు ఎవరూ ఓటు వేయరు..
లోకల్ మీడియా ఒక బ్రోకర్ మీడియా అయిపోయింది. బండి సంజయ్ పోక్సో కేసు మీద ఒక్క వార్త కూడా వేయలేదు. కొడుకుని కాపాడుకోడానికి బండి సంజయ్ డబ్బులను నీళ్ల లాగా ఖర్చుపెడుతున్నాడు. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయమన్నందుకు నన్ను అరెస్ట్ చేసి వేధించారు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కి ఎవరు ఓటు వేయరు. రేపు బండి సంజయ్ మీద ఈ మైనర్ అమ్మాయి పోటీ చేస్తే అతను చిత్తు చిత్తుగా ఓడిపోతాడు. అప్పుడు ఆమెనే ఈడ్చుకుపోయి జైలులో వేస్తుంది అని బక్క జడ్సన్ చెప్పారు.
బండి సంజయ్ కొడుక్కి డ్రగ్ టెస్ట్ చేయాలి..
V6 జర్నలిస్ట్ సంగప్పనే ఆ మైనర్ అమ్మాయి వీడియోలు మీడియాకి ఇచ్చాడు. అసలు కేటీఆర్‌కి కాదు బండి సంజయ్ కొడుకుకి డ్రగ్స్ టెస్ట్ చేయించాలి. చెన్నై తీసుకువెళ్లి టెస్ట్ చేయించాలి. మళ్లీ ఇక్కడ అయితే రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తాడు అని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



