Koppula Eshwar | బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
Koppula Eshwar | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath)పై నమోదైన పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం, పోలీసుల తీరును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు. బీసీ వర్గానికి చెందిన ఒక బాలికను బండి భగీరథ్ మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమన్నారు.
- కొడుకు ఆచూకీ లేకపోయినా తండ్రిగా సంజయ్‌కు కంగారు లేదు
- ఏంచక్కా సభల్లో పాల్గొంటుండు
- ఆయనే తప్పించాడనే అనుమానం ఉంది
- బీజేపీ నేతలకు కాంగ్రెస్ మద్దతు దండిగా లభిస్తుంది
- కాంగ్రెస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar | త్రినేత్ర.న్యూస్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath)పై నమోదైన పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం, పోలీసుల తీరును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో అధికార యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. బీసీ వర్గానికి చెందిన ఒక బాలికను బండి భగీరథ్ మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
బండి సంజయ్‌పై కేసు పెట్టాలి..
సామాన్యుడికి ఒక చట్టం, కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా? అని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైనా ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు. బాధిత తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొడుకు ఆచూకీ లేకపోయినా, ఫోన్ స్విచ్ఛాఫ్ ఉన్నా తండ్రిగా సంజయ్ కంగారు పడకుండా సభల్లో పాల్గొనడం చూస్తుంటే.. ఆయనే స్వయంగా నిందితుడిని తప్పించారనే అనుమానం కలుగుతోందని అన్నారు.
పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు (5-7) పెట్టకుండా కేవలం 11వ సెక్షన్ పెట్టడం నిందితుడిని కాపాడే ప్రయత్నమేనని ఆరోపించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బాధితులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తే తప్ప కేసు నమోదు చేయలేదని గుర్తుచేశారు.
తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ నేతలకు దండిగా మద్దతు లభిస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న అపవిత్ర మైత్రి వల్లే అరెస్టులు జరగడం లేదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బండి భగీరథ్‌ను అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కొప్పుల డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






