LPG ATM | ఇక ఎనీ టైం గ్యాస్.. గురుగ్రామ్‌లో మొదటి ఏటీఎం షురూ
LPG ATM | పశ్చిమాసియా యుద్ధం వంటిలపై మంట పెడుతోంది. సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని ఇంటికెప్పుడొస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న 'స్మార్ట్ ఎల్‌పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది. మొదటి ఎల్‌పీజీ ఏటీఎం(LPG ATM) ను భారత్ (Bharath) గురుగ్రామ్(Gurugram)లో ప్రారంభించింది.
త్రినేత్ర.న్యూస్: పశ్చిమాసియా యుద్ధం వంటిలపై మంట పెడుతోంది. భారత్‌పై ప్రభావం చూపుతోంది. భారత్ దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో సరఫరాలో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడడం సమస్యగా మారింది. సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని ఇంటికెప్పుడొస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న 'స్మార్ట్ ఎల్‌పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది. మొదటి ఎల్‌పీజీ ఏటీఎం(LPG ATM) ను భారత్ (Bharath) గురుగ్రామ్(Gurugram)లో ప్రారంభించింది. గురుగ్రామ్‌లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.
సిలిండర్ ను ఇలా పొందొచ్చు..
'భారత్ గ్యాస్ ఇన్‌స్టా ఎల్‌పీజీ' పేరుతో దీన్ని పిలుస్తారు. సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలందిస్తుంది. ముందుగా మెషిన్ స్క్రీన్‌పై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. అనంతరం మీ ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్‌కోడ్‌ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.
విండో తెరుచుకున్నాక అందులో ఖాళీ సిలిండర్‌ను పెట్టాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసుకొని లోపలికి తీసుకుంటుంది. స్క్రీన్‌పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం పక్కనే ఉన్న డెలివరీ విండో నుంచి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.
ఇవీ ఏటీఎం ప్రత్యేకతలు..
- లెట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే తేలికగా ఉంటాయి.
- స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్‌లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి కేవలం రెండు సిలిండర్లే ఉన్నప్పుడు మెషిన్ సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.
త్వరలో దేశవ్యాప్తంగా..
గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి, సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం వినియోగదారులకు ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






