త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | చ‌మురు కంపెనీల‌కు ఆర్‌బీఐ బిగ్‌న్యూస్‌.. స్పెష‌ల్‌గా డాల‌ర్ విండో

RBI | అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు కొనుగోళ్ల కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అవసరమైన డాలర్లను స‌మ‌కూర్చేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ప్ర‌త్యేకంగా విదేశీ మారకద్రవ్య విండోను ఏర్పాటు చేసింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)ల రోజువారీ డాలర్ల అవసరాలను ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పూర్తిగా తీర్చనుంది.

P

Business | Published On Oct 10, 2026, 3.47 pm IST

RBI | చ‌మురు కంపెనీల‌కు ఆర్‌బీఐ బిగ్‌న్యూస్‌.. స్పెష‌ల్‌గా డాల‌ర్ విండో
Advertisement

RBI | అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు కొనుగోళ్ల కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అవసరమైన డాలర్లను స‌మ‌కూర్చేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ప్ర‌త్యేకంగా విదేశీ మారకద్రవ్య విండోను ఏర్పాటు చేసింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)ల రోజువారీ డాలర్ల అవసరాలను ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పూర్తిగా తీర్చనుంది. అక్టోబర్ 12 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. త‌ర్వాతి ఆదేశాలు వెలువ‌డే వ‌ర‌కు ఈ విండో విధానం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ప్రస్తుత కరెన్సీ, ఆర్థిక మార్కెట్ల పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఈ ఏర్పాటును తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కొత్త విధానంలో అధీకృత డీలర్‌ బ్యాంకుల ద్వారా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలకు అమెరికా డాలర్లను విక్రయించనుంది. దీంతో ఈ సంస్థలు తమ రోజువారీ అవసరాల కోసం బహిరంగ మార్కెట్‌లో డాలర్లను కొనుగోలు చేయడంపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆర్‌బీఐ నిర్దేశించిన బ్యాంకింగ్‌ మార్గం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని పొందవచ్చు. ఈ ప్రత్యేక సదుపాయం ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లకు మాత్రమే. ఈ మూడు సంస్థల మొత్తం రోజువారీ డాలర్ల అవసరాలను తీర్చడమే దీని లక్ష్యం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు కొనుగోళ్లకు డాలర్లు కీలకం కావడంతో, వాటి సరఫరా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నిర్ణయం వెనుక డాలర్‌ ధరలో నిర్దిష్ట మార్పులు, మార్కెట్‌లో చోటుచేసుకున్న ప్రత్యేక పరిణామాలే కారణమా అన్న‌దానిపై ఆర్‌బీఐ స్పందించ‌లేదు. అలాగే, దీంతో రూపాయి మారకం విలువ ఎంతమేర ప్రభావితమవుతుంది? పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులుంటాయా? అనే అంశాలపైనా స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని రూపాయి బలోపేతానికి లేదా ఇంధన ధరల తగ్గింపునకు ప్రత్యక్ష చర్యగా భావించ‌లేమ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చే ఈ ప్రత్యేక విండో పనితీరుపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దీని కొనసాగింపు, త‌ర్వాతి మార్పులపై ఆర్‌బీఐ ఇచ్చే ఆదేశాలు కీలకం కానున్నాయి.

Advertisement
Advertisement