త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | డింపుల్ వ‌ల్లే భోగి ప్ర‌మోష‌న్స్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ దూరం – క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

భోగి ప్ర‌మోష‌న్స్‌కు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ దూరంగా ఉండ‌టంపై టాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. డింపుల్ హ‌య‌తిని హైలైట్ చేయాల‌నే అనుప‌మ పాత్ర ప్రాధాన్య‌త‌ను త‌గ్గిస్తూ క‌థ‌లో మార్పులు చేశారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై సోష‌ల్ మీడియా ద్వారా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క్లారిటీ ఇచ్చింది.

N

Entertainment | Published On Nov 26, 2026, 4.10 pm IST

Anupama Parameswaran | డింపుల్ వ‌ల్లే భోగి ప్ర‌మోష‌న్స్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ దూరం – క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
Advertisement

Anupama Parameswaran | భోగి సినిమా ప్ర‌మోష‌న్స్‌కు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ దూరంగా ఉండ‌టంపై టాలీవుడ్ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌పై మ‌ల‌యాళ సొగ‌స‌రి క్లారిటీ ఇచ్చింది. శ‌ర్వానంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భోగి మూవీ న‌వంబ‌ర్ 27న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు డింపుల్ హ‌య‌తి మ‌రో హీరోయిన్‌గా న‌టించింది.
భోగి ప్రీ రిలీజ్‌, ట్రైల‌ర్‌తో పాటు ప‌లు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు డింపుల్ హ‌య‌తి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. శ‌ర్వానంద్‌తో ఆమె క్లోజ్‌నెస్‌, బాండింగ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదే టైమ్‌లో ఈ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ల‌కు సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ దూరంగా ఉండ‌టంపై అనేక పుకార్లు షికారు చేశాయి.

ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ...

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పాత్ర ప్రాధాన్య‌త‌ను త‌గ్గించి డింపుల్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ పెంచార‌ని వార్త‌లొచ్చాయి. డింపుల్‌ను హైలైట్ చేయ‌డం కోసం స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేర్పులు చేశార‌ని అంటున్నారు. అనుప‌మ వ‌స్తే మీడియా ఫోక‌స్ అంత ఆమె మీద‌నే ఉంటుంద‌ని, డింపుల్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని...ఆందుకే మ‌ల‌యాళ బ్యూటీని ప్ర‌మోష‌న్ల‌కు పిల‌వ‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అందుకే దూరం....

ఈ రూమ‌ర్ల‌పై అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క్లారిటీ ఇచ్చింది. ముంద‌స్తు క‌మిట్‌మెంట్ల కార‌ణంగా ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్లే భోగి ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండాల్సివ‌చ్చింద‌ని చెప్పింది. భోగి రిలీజ్ డేట్ మార‌డంతో ప్ర‌మోష‌న్స్‌కు అనుగుణంగా డేట్స్ స‌ర్ధుబాటు చేసుకోవ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నించాన‌ని, కానీ కుద‌ర‌లేద‌ని చెప్పింది. ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉన్నా త‌న మ‌న‌సంతా భోగి సినిమాపైనే ఉంద‌ని, ఫ‌స్ట్ డే, ఫ‌స్ట్ షో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూసేందుకు తాను ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం ఓ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం ఊటీలో ఉన్న‌ట్లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ ఓ పోస్ట్ పెట్టింది. రూమ‌ర్ల‌కు చెక్ పెట్టింది.

 

Advertisement
Advertisement