Sampath Nandi | సెన్సార్ అడ్డంకులకు కారణమదే – ఐటెంసాంగ్స్ ఉండవు – “భోగి”పై సంపత్ నంది కామెంట్స్
భోగి కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, అనుపమ డబ్బింగ్ సొంతంగా డబ్బింగ్ చెప్పారని డైరెక్టర్ సంపత్ నంది అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన భోగి మూవీ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భోగి సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు చెప్పడానికి గల కారణాలను రివీల్ చేశారు సంపత్ నంది.
Entertainment | Published On Nov 24, 2026, 6.34 pm IST
Sampath Nandi | భోగి సినిమాలో రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని అందుకే సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీకి ఈ సినిమాను పంపించిందని సంపత్ నంది అన్నారు. సాయిధరమ్‌తేజ్‌తో చేయాలనుకున్న గాంజా శంకర్‌కు భోగి కథతో సంబంధం లేదని చెప్పారు. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోహీరోయిన్లుగా నటించిన భోగి మూవీ నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సంపత్ నంది చెప్పిన ముచ్చట్లివి...
బాల్య జ్ఞాపకాలు
భోగి కథకు నా బాల్య జ్ఞాపకాలు స్ఫూర్తినిచ్చాయి. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో రామగిరి గుట్ట అని ఒక చోటు ఉండేది. అప్పట్లో ఓ వ్యక్తి గురించి రకరకాల పుకార్లు వినిపించేవి. ఆ వ్యక్తిని చూడగానే చిన్న పిల్లలుగా ఉన్న మేమంతా భయపడి పరిగెత్తేవాళ్లం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చేవాడు? మేమంతా ఎందుకు పరిగెత్తేవాళ్లం? అన్న దానికి కారణమైన సంఘటన నా మనసులో బలంగా నిలిచిపోయింది. ఊరంతా భయపడిన ఆ ఇన్సిడెంట్‌నే కథగా రాయాలని అనుకున్నా. ఇదే తరహాలో మహారాష్ట్ర బోర్డర్‌లో కూడా ఒక సంఘటన జరిగిందని ఒకరు పేపర్ కటింగ్ తీసుకొచ్చారు. వాస్తవ ఘటనలకు ‘బొగ్గుల గుట్ట’ అనే ఫిక్షనల్ విలేజ్‌ను క్రియేట్ చేసి, ఆ విలేజ్‌లో ఒక ఇన్సిడెంట్‌ను సృష్టించాం. అది పాత రోజుల్లో జరిగిన కథ కాబట్టి వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులు, కల్చర్, కట్టుబాట్లు, పద్ధతులు, ప్రేమలు.. ఇవన్నీ చూపిస్తూ ఒక పీరియాడిక్ సినిమాలా రూపొందించాం.
రక్తపాతం...
రక్తపాతం ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించింది. నేను ఎంచుకున్న కథలో రక్తపాతానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. రివైజింగ్ కమిటీలో కూడా మా సన్నివేశాల్ని తొలగించలేదు. మేము ఏదైతే తీశామో అది అలాగే ఉంది. కాకపోతే కొన్ని మ్యూట్స్ చెప్పారు.ఇది అందరూ చూడగలిగే సినిమా. సినిమాలో చాలా వయలెన్స్ ఉంటుందని ట్రైలర్, టీజర్‌లోనే క్లారిటీ ఇచ్చాం. ఇప్పటివరకు శర్వానంద్ ఇలాంటి సినిమా చేయలేదు. నాకు కొత్త జానర్. . హై వయలెన్స్ ఉండే యాక్షన్ సినిమా కావడంతో శర్వానంద్ లుక్, ఆయన మాట్లాడే ప్రతి మాట కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమాలో శర్వానంద్ తెలంగాణ యాసలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పాడు.
పదిహేనునిమిషాలు...
శర్వానంద్‌ను కలిసి భోగి కథను 15 నిమిషాల పాటు చెప్పాను. మనం కలిసి చేస్తే ఇలాంటి అద్భుతమైన కథ చేయాలని ఆయన అన్నారు. వెంటనే ఓకే అన్నారు. తర్వాత మా జర్నీ మొదలైంది. ఇందులో హీరో లుక్‌ను సెట్ చేయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కావాలి. అప్పటి మనుషులు తినే దానికంటే ఎక్కువగా కష్టపడేవాళ్లు. అలాంటి లుక్ కావాలి. శర్వా పూర్తిగా సన్నబడ్డారు. ఇందులో మీసాలు, గడ్డాలు కూడా కావాలి. అలా ఆ పాత్రకు తగ్గట్టుగా ఎంతో కేర్ తీసుకుని ఆయనను మలిచాం. నాలుగైదు లుక్ ట్రయల్స్ తర్వాత ఫైనల్‌గా ఒక లుక్ సెట్ అయింది.
బొగ్గుల విలేజ్ సెట్...
ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో బొగ్గుల గుట్ట విలేజ్ సెట్ నిర్మించాం. అప్పట్లో చెట్లు, అన్ని వసతుల మధ్య గ్రామాలు ఉండేవి. అలాంటి ఒక ప్రాంతాన్ని చూసుకుని అక్కడ ఈ సెట్ నిర్మించాం. బడ్జెట్ పరంగా మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది. అలాగే టైమ్ కూడా ఎక్కువ పట్టింది. ఇది మూడేళ్ల ప్రాజెక్ట్.
గాంజా శంకర్...
సాయిధరమ్‌తేజ్‌తో చేయాలనుకున్న గాంజా శంకర్‌కు భోగి కథకు ఎలాంటి సంబంధం లేదు. గాంజా శంకర్ కంప్లీట్‌గా క్రిమినల్ స్టోరీ. భోగి రూటెడ్ కథ. అన్నాచెల్లెళ్ల ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది
గేయ రచయిత చంద్రబోస్ భోగి సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. ఈ సినిమాలోని పాటలన్నీ సింగిల్ కార్డ్ లో ఆయనతోనే రాయించాను. ప్రతి అక్షరం చంద్రబోస్ రాశారు. కథ విని లొకేషన్‌కు వచ్చి ఈ సినిమాలోని పాటలు రాశారు.
ఐటెంసాంగ్స్ ఉండవు...
మొన్న ఒక స్నేహితుడు ఐటెం సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావని అడిగాడు. నా గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని అతడు ఆ ప్రశ్న అడిగాడని అర్థమైంది . కాకపోతే ఈ సినిమా ఆ మీటర్‌లో ఉండదు. నా పంథాకు కాస్త భిన్నంగా ప్రయత్నించాను. ఇందులో ఐటెంసాంగ్ పెట్టాలని అనుకున్నాం. అది కథకు అడ్డొస్తుందని భావించి చిత్రీకరించలేదు.
డింపుల్ హయతి...
ఇందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. కాకపోతే అది రెగ్యులర్ లవ్ స్టోరీలా ఉండదు. పల్లెటూర్లో ఉండే ఒక ప్రేమకథ ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. చాలా అందమైన రిలేషన్‌షిప్ ఉంటుంది. డింపుల్ హయాతి, అనుపమ ఇద్దరూ పోటీపడి నటించారు. అనుపమ తన పాత్రకు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పింది.
స్వచ్ఛమైన తెలంగాణ...
నిజానికి ఒకప్పుడు ఉర్దూ భాష కలవని తెలంగాణ ఉండేది. అలాంటి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడించే ప్రయత్నం చేశాను. నేను స్వతహాగా తెలంగాణ వాసిని. చిన్నప్పటి నుంచి నాకు ఆ భాష, యాస మీద పట్టు ఉంది. సాహిత్యం మీద కూడా పట్టు ఉంది. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ అన్నీ రాశాను.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Fahadh Faasil | ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం – రాజమౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
నవంబర్ 24, 2026

Sree Vishnu | “ఫ్యామిలీ ప్యాక్” టీజర్ రిలీజ్ – సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు కామెడీ మూవీ
నవంబర్ 23, 2026

Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ – ఇప్పుడు ప్రశంసలు
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Anbil Avan Review | ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంట - కన్నప్ప హీరోయిన్ తమిళ మూవీ ఎలా ఉందంటే?
- ●Supreme Court | కునో, ఉజ్జయినిలో సఫారీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు
- ●Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి
- ●Harish Rao vs Revanth Reddy Krishna Waters | అవి పచ్చి అబద్ధాలు.. ఇవిగో అసలు వాస్తవాలు
- ●Black Hole | రాకాసి కృష్ణబిలం.. సూరుడి కంటే 36 కోట్ల రెట్లు భారీగా..!

Anbil Avan Review | ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంట - కన్నప్ప హీరోయిన్ తమిళ మూవీ ఎలా ఉందంటే?

Supreme Court | కునో, ఉజ్జయినిలో సఫారీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు

Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి



