త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | మాస్ కాంబో సెట్ – ద‌స‌రాకు అల్లు అర్జున్ – బోయ‌పాటి మూవీ అనౌన్స్‌?

స‌రైనోడు త‌ర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా సెట్ట‌యిన‌ట్లు స‌మాచారం. ద‌స‌రాకు ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

N

News | Published On Oct 5, 2026, 3.47 pm IST

Allu Arjun | మాస్ కాంబో సెట్ – ద‌స‌రాకు అల్లు అర్జున్ – బోయ‌పాటి మూవీ అనౌన్స్‌?
Advertisement

Allu Arjun |  స‌రైనోడు కాంబినేష‌న్ రిపీట్ కానుందా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రానుందా అంటే ఔన‌నే టాలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అఖండ 2 త‌ర్వాత బోయ‌పాటి శ్రీను తన‌ త‌దుప‌రి సినిమా గీతా ఆర్ట్స్‌లో చేయ‌బోతున్న‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్‌...

2016లో అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో స‌రైనోడు వ‌చ్చింది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ద‌స‌రాకు అనౌన్స్‌మెంట్‌..

స‌రైనోడు టైమ్‌లోనే బోయ‌పాటితో మ‌రో సినిమా చేస్తాన‌ని బ‌న్నీ ప్ర‌క‌టించాడు. అప్ప‌టి నుంచి ఈ క‌ల‌యిక‌పై త‌ర‌చుగా రూమ‌ర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్ట‌కేల‌కు ఈ మాస్ కాంబో సెట్ట‌యిన‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్ స్వీయ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్‌ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ద‌స‌రాకు బ‌న్నీ, బోయ‌పాటి మూవీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

నెలాఖ‌రున‌...

సోమ‌వారం తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామిని బోయ‌పాటి శ్రీను ద‌ర్శించుకున్నారు. త‌న త‌దుప‌రి సినిమా ఫైన‌ల్ అయ్యింద‌ని, ఈ నెలాఖ‌రున అనౌన్స్ చేస్తాన‌ని అన్నారు. అల్లు అర్జున్ సినిమాను ఉద్దేశించే బోయ‌పాటి ఈ కామెంట్లు చేశాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు.  బాల‌కృష్ణ అఖండ 2 డిజాస్ట‌ర్‌తో నిల‌వ‌డంతో మాస్ పంథాకు భిన్నంగా డిఫ‌రెంట్ యాక్ష‌న్ స్క్రిప్ట్‌ను బోయ‌పాటి సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియ‌న్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే హంగుల‌తో కూడిన ఈ క‌థ‌ను ఇటీవ‌లే అల్లు అర్జున్‌ను క‌లిసి వినించిన‌ట్లు తెలిసింది.  క‌థ న‌చ్చ‌డంతో పాటు మాస్ ప‌ల్స్ తెలిసిన డైరెక్ట‌ర్ కావ‌డం...హిందీలో బోయ‌పాటి సినిమాల‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని బ‌న్నీ ఈ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ద‌స‌రాకు స్పెష‌ల్ వీడియో ద్వారా ఈసినిమాను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వినికిడి.

ఒకేసారి షూటింగ్‌...

ప్ర‌స్తుతం రాకా తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.... కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో ో సినిమాను అంగీక‌రించాడు. సూప‌ర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ఉండ‌బోతుంది. లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో పాటు బోయ‌పాటి సినిమాల షూటింగ్‌ల‌ను ఒకే సారి పూర్తిచేయాల‌నే ప్లాన్‌లో అల్లు అర్జున్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

 

Advertisement
Advertisement