త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airspace Closed | ఇరాన్ గ‌గ‌న‌త‌లం మూసివేత‌.. ప‌లు విమానాలు ర‌ద్దు, మ‌రికొన్ని దారిమ‌ళ్లింపు

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయుతుల్లా ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున‌ నిర‌స‌న‌లు (Iran Protests ) కొన‌సాగుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ఈ నిర‌స‌న‌లు ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌కంగా మారాయి.

G

National | Published On Jan 15, 2026, 11.34 am IST

Airspace Closed | ఇరాన్ గ‌గ‌న‌త‌లం మూసివేత‌.. ప‌లు విమానాలు ర‌ద్దు, మ‌రికొన్ని దారిమ‌ళ్లింపు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయుతుల్లా ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున‌ నిర‌స‌న‌లు (Iran Protests ) కొన‌సాగుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ఈ నిర‌స‌న‌లు ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌కంగా మారాయి. దీంతో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అమెరికాతో ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. దీనికి దేశంలో హింసాత్మ‌క నిర‌స‌న‌లు తోడవ‌డంతో వాణిజ్య విమానాల రాక‌పోక‌ల‌కు ఇరాన్ త‌న గ‌గ‌న‌త‌లాన్ని (Airspace Closed) మూసివేసింది. ప‌లు భార‌తీయ విమానాలపై ఈ ప్ర‌భావం ప‌డింది. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లు త‌మ ప్ర‌యాణికుల‌కు అడ్వైజ‌రీ జారీచేశాయి. ఇరాన్‌లో ఉద్రిక్తతల నేప‌థ్యంలో కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని వెళ్ల‌డించాయి.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాన్‌ మీదుగా వెళ్లాల్సిన ప‌లు విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నామ‌ని ఎయిర్ ఇండియా (Air India) వెల్ల‌డించింది. ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామ‌ని తెలిపింది. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన స‌ర్వీసుల‌ను గురించి ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాల‌ని సూచించింది. ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నామ‌ని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

ఇండిగో (IndiGo) కూడా త‌న ప్ర‌యాణికుల కోసం ఇదే త‌ర‌హా సూచ‌న‌లు చేసింది. ఇరాన్‌ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని వెల్ల‌డించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని తెలిపింది. అందువ‌ల్ల ప్రయాణికులు తమకు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేసింది.

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేయ‌డం వ‌ల్ల కొన్ని విమాన స‌ర్వీసుల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని మ‌రో విమాన‌యాన సంస్థ స్పైస్ జెట్ వెల్ల‌డించింది. ప్ర‌యాణికులు తామ విమాన స‌ర్వీసు వివ‌రాల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వెబ్‌సైట్ ద్వారా చెక్‌చేసుకోవాల‌ని కోరింది. లేదా 24 గంట‌లూ ప‌నిచేసే హెల్ప్‌లైన్ నంబ‌ర్లు +91(0)124 4983410 లేదా +91(0)124 7101600లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపింది.

గతంలో కూడా ఇరాన్ త‌న గ‌గ‌న త‌లాన్ని మూసివేసింది. గ‌తేడాది జూన్‌లో ఇజ్రాయెల్‌తో 12 రోజుల‌పాటు సాగిన దాడులు, ప్ర‌తిదాడుల సంద‌ర్భంగా ఇరాన్ త‌న గ‌గ‌న త‌లంపై నుంచి విమాన రాక‌పోక‌ల‌ను నిషేధించింది.

Advertisement
Advertisement