FSSAI Norm Violations | మద్యం ప్రియులకు బిగ్ అలెర్ట్.. మూడు కంపెనీల లిక్కర్‌పై నిషేధం..!
FSSAI Norm Violations | రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రముఖ మద్యం బ్రాండ్లకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్, ఓల్డ్‌మాంక్ తయారీ సంస్థలకు చెందిన కొన్ని మద్యం ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్వహించిన తనిఖీల్లో ఆయా ఉత్పత్తుల్లో నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ ఫ్లేవరింగ్ పదార్థాలను వినియోగించినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
- కృత్రిమ ఫ్లేవర్లను వినియోగిస్తున్నట్లు తేలడంతో విక్రయాలకు బ్రేక్..
- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచనలతో ఎక్సైజ్ శాఖ చర్యలు
FSSAI Norm Violations | రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రముఖ మద్యం బ్రాండ్లకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్, ఓల్డ్‌మాంక్ తయారీ సంస్థలకు చెందిన కొన్ని మద్యం ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్వహించిన తనిఖీల్లో ఆయా ఉత్పత్తుల్లో నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ ఫ్లేవరింగ్ పదార్థాలను వినియోగించినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అసలు విషయం ఏంటంటే..
విస్కీ, రమ్ వంటి మద్యం ఉత్పత్తులకు ప్రత్యేకమైన రుచి, వాసన సంప్రదాయ తయారీ విధానంలో బారెల్‌లలో పరిపక్వం (మ్యాచ్యురేషన్) పొందిన తర్వాత సహజంగానే వస్తుంది. అయితే, కొన్ని తయారీ యూనిట్లలో ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో పాటించకుండా అదే రుచి, వాసన వచ్చేందుకు విస్కీ ఫ్లేవర్‌ను విస్కీలో, రమ్ ఫ్లేవర్‌ను రమ్‌లో అదనంగా కలిపినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది. ఇలాంటి విధానం ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. డియాజియో ఇండియా (యునైటెడ్ స్పిరిట్స్) తయారు చేస్తున్న రాయల్ ఛాలెంజ్ విస్కీ, ఆంటిక్విటీ బ్లూ బ్రాండ్లతో పాటు ఇన్‌బ్రూ బేవరేజెస్‌కు చెందిన బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ ఎక్స్‌ఎక్స్‌ఎక్స్ రమ్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ తయారు చేస్తున్న ఓల్డ్‌మాంక్‌కు చెందిన కొన్ని వేరియంట్లను నిషేధించింది. నిబంధనలకు విరుద్ధంగా తయారైన ఉత్పత్తులను రాష్ట్రంలో విక్రయించకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. అయితే, ఫసాయ్ నిర్ణయాన్ని సవాల్ చేసిన లిక్కర్ తయారీ కంపెనీలకు ఎక్సైజ్‌శాఖ ఊరట కలిగించింది. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్టాక్‌ను విక్రయించుకునేందుకు పలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. బాటిళ్ల ముందు భాగంలో కృత్రిమ ఫ్లేవర్స్‌ను ఉపయోగించామని వినియోగదారులకు కనపడేలా సవరించిన లేబుల్స్‌ను అతికించాలని, ఆ తర్వాతే విక్రయించుకోవాలని స్పష్టం చేశారు.
నిబంధనలు ఏమంటున్నయ్..?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం మద్యం తయారీలో అనుమతించిన పదార్థాలను మాత్రమే వినియోగించాలి. సహజ పరిపక్వత ద్వారా రావాల్సిన రుచి, సువాసనను కృత్రిమంగా సృష్టించే విధంగా అదే తరహా ఫ్లేవర్లను కలపడం నిబంధనలకు విరుద్ధం. వినియోగదారుడికి ఉత్పత్తి నాణ్యతపై తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున ఇలాంటి ఉత్పత్తులను ‘సబ్‌స్టాండర్డ్’గా పరిగణిస్తారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజా నిర్ణయం తెలంగాణకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాణ్యత ప్రమాణాల అమలులో ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఈ చర్యతో సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా తయారీ జరిగితే ఎంత పెద్ద బ్రాండ్‌కైనా మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు






