త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aamir Khan | ప్రియురాలితో క‌లిసి కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్ – పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్‌

ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో క‌లిసి కొత్తింట్లోకి అడుగుపెట్టారు ఆమిర్‌ఖాన్‌. ముంబాయిలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిన ఆమిర్‌ఖాన్ బుధ‌వారం నూత‌న గృహ‌ప్ర‌వేశం చేశారు. గౌరీతో పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు ఆమిర్‌ఖాన్‌.

N

News | Published On Jan 22, 2026, 2.51 pm IST

Aamir Khan | ప్రియురాలితో క‌లిసి కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమిర్ ఖాన్ – పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్‌
Advertisement

Aamir Khan | బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ నూత‌న గృహ‌ప్ర‌వేశం చేశారు. అందులో విశేషం ఏముంద‌ని అనుకుంటున్నారా. హీరోలు కొత్త ఇళ్లులు కొన‌డం కామ‌నే. కానీ ఆమిర్‌ఖాన్ పెళ్లి చేసుకోకుండానే త‌న ప్రియురాలి గౌరీ స్ప్రాట్‌తో క‌లిసి కొత్తింట్లోకి అడుగుపెట్టారు. ముంబాయిలోని త‌న కుటుంబ‌స‌భ్యులు ఉంటున్న ఏరియాలోనే ఆమిర్‌ఖాన్ కొత్త ఇళ్లు కొనుగోలు చేశార‌ట‌.  గురువారం ప్రేయసితో గృహ‌ప్ర‌వేశం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండేళ్లుగా ప్రేమ‌లో...

గౌరీ స్ప్రాట్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా త‌న అర‌వ‌య్య‌వ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ‌త ఏడాది మార్చిలో అధికారికంగా ప్ర‌క‌టించారు ఆమిర్‌ఖాన్‌. గౌరీ స్ప్రాట్ తో ఆమిర్‌కు ఇర‌వై ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ట‌. అయితే రెండేళ్ల క్రిత‌మే ఆమెతో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు మొత్తం గౌరీనే చూసుకుంటుంద‌ట‌.
గౌరీ స్ప్రాట్‌తో పెళ్లిపై ఆమిర్‌ఖాన్ రియాక్ట్ అయ్యారు. "మా మ‌న‌సులు ఎప్పుడో క‌లిశాయి. ఒక‌రిని మ‌రొక‌రం అర్థం చేసుకుంటూ గౌర‌వంతో ముందుకు సాగుతున్నాం. క‌లిసే ఉంటున్నాం కాబ‌ట్టి మేము పెళ్లి చేసుకున్న‌ట్లేన‌ని" ఆమిర్‌ఖాన్ అన్నారు. అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? లేదా? అన్న‌ది భ‌విష్య‌త్తులో కాల‌మే నిర్ణ‌యిస్తుంది అంటూ తెలివిగా స‌మాధానం ఇచ్చారు.

రెండు సార్లు పెళ్లి...

ఆమిర్ ఖాన్‌కు ఇప్ప‌టికే రెండు సార్లు పెళ్ల‌య్యింది. 1986లో రీనా ద‌త్తాను పెళ్లిచేసుకున్న ఆమిర్‌ఖాన్ 2002ల‌తో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ త‌ర్వాత త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేసిన కిర‌ణ్ రావ్‌తో 2005 లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా 2021లో ఆమిర్‌ఖాన్‌, కిర‌ణ్ రావ్ విడాకులు తీసుకున్నారు. గౌరీ స్ప్రాట్‌కు పెళ్ల‌య్యింది. భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.
ప్ర‌స్తుతం యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్న ఆమిర్‌ఖాన్ ప్రొడ్యూస‌ర్‌గా మూడు సినిమాలు చేస్తున్నాడు. హ్యాపీ ప‌టేల్‌తో పాటు ఎక్‌దిన్‌, లాహోర్ 1947 సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement