త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Software Engineer Death | పెళ్లింట తీవ్ర విషాదం.. త‌మ్ముడి పెళ్లి రోజే డెక‌రేష‌న్ వైర్లు త‌గిలి అన్న మృతి

Software Engineer Death | త‌మ్ముడి వివాహం రోజే విద్యుత్ షాక్‌తో అన్న మృతి చెందిన విశాద ఘ‌ట‌న ఇది. విజ‌య‌న‌గ‌రం (Vijayanagaram) జిల్లాకు చెందిన స‌తీశ్ (Sathish) హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. త‌మ్ముడి పెళ్లి రోజే డెక‌రేష‌న్ వైర్లు త‌గిలి ప్రాణాలు కోల్పోయాడు.

S

News | Published On May 1, 2026, 12.43 pm IST

Software Engineer Death | పెళ్లింట తీవ్ర విషాదం.. త‌మ్ముడి పెళ్లి రోజే డెక‌రేష‌న్ వైర్లు త‌గిలి అన్న మృతి
Advertisement

Software Engineer Death | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మ్ముడి వివాహం వేళ కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులంతా పెళ్లి సంబ‌రాల్లో ఉంన్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో నూత‌న జంట‌ను దీవించాల్సిన అన్న‌ను విధి వెంటాడింది. విద్యుత్ తీగ‌ల రూపంలో ప్రాణాల‌ను మింగేసింది. ఈ తీవ్ర విషాద ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం (Vijayanagaram) జిల్లాలో శుక్ర‌వారం చోటుచేసుకుంది.

వివ‌రాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మిర్తివలసకు చెందిన స‌తీశ్(32) (Sathish) హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (Software engineer) గా పని చేస్తున్నాడు. తమ్ముడి వివాహం ఉండ‌డంతో ఎంతో ఉత్సాహంతో సొంతూరుకెళ్లాడు. పెళ్లి ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలో స‌తీశ్‌ మేడపై దుస్తులు ఆరేస్తున్నాడు. అక్క‌డే పెళ్లి డెకరేషన్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లు గ‌మ‌నించ‌క‌పోడంతో అవి తగిలి విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

వెంట‌నే గుర్తించిన బంధువులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అల‌ముకున్నాయి. కాగా సతీశ్​కు ఏడాది క్రితమే వివాహమైన‌ట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement