త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zomato | జొమాటో బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీకి అద‌న‌పు ఛార్జీలు

Zomato | ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) వినియోగదారులకు భారీ షాకిచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్ష‌న్ (cash on delivery orders) ఎంచుకునే క‌స్ట‌మ‌ర్ల నుంచి అద‌న‌పు రుసుమును వ‌సూలు చేస్తోంది.

D

National | Published On Sep 12, 2026, 2.36 pm IST

Zomato | జొమాటో బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీకి అద‌న‌పు ఛార్జీలు
Advertisement

Zomato | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) వినియోగదారులకు భారీ షాకిచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్ష‌న్ ఎంచుకునే క‌స్ట‌మ‌ర్ల (cash on delivery orders) నుంచి అద‌న‌పు రుసుమును వ‌సూలు చేయ‌డం మొద‌లు పెట్టింది. జొమాటో బిల్లు స‌మ్మ‌రీలో ఈ కొత్త పే-ఆన్-డెలివరీ ఫీజు ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది.

సాధార‌ణంగా రూ. 5 నుంచి ప్రారంభమవుతున్న ఈ ఛార్జీ ఆర్డ‌ర్‌ను బ‌ట్టి రూ.7 నుంచి రూ.20 వ‌ర‌కూ మారుతున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్డ‌ర్ల‌లో కార్ట్ విలువ‌లో 2% వ‌సూలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అంటే గ‌రిష్టంగా రూ.30 వ‌ర‌కూ వ‌సూలు చేస్తోంద‌న్న‌మాట‌. అయితే, ఇది కేవ‌లం క్యాష్ ఆన్ డెలివ‌రీ ఎంచుకున్న‌వారికే వ‌ర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే వారికి ఈ అద‌న‌పు బాదుడు వ‌ర్తించ‌దు.

ఫుడ్‌ డెలివ‌రీ స‌మ‌యంలో న‌గ‌దు స్వీక‌రించేందుకు అద‌న‌పు కార్యాచరణ ప్రక్రియలు (operational processes), మరింత సమన్వయం (coordination) అవసరమవుతాయి కాబట్టి ఈ ఛార్జీ విధిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. డోర్‌స్టెప్ వద్ద నగదు చెల్లించే కస్టమర్ల కోసం ఇది ఒక కన్వీనియన్స్ ఛార్జీ అని పేర్కొంటోంది. సంస్థ నిర్ణ‌యంతో ఇప్పటికే అమల్లో ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకింగ్ ఛార్జీలు, జీఎస్టీ (GST)లతో పాటు ఈ కొత్త ఫీజు వినియోగదారులపై అదనపు భారంగా మార‌నుంది.

ప్ర‌స్తుతం ఫుడ్ డెలివ‌రీ రంగంలో తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. కొత్త‌గా మార్కెట్‌లోకి రాపిడో ఓన్లీ (Rapido Only), ఫ్లిప్‌కార్ట్ 'ఈట్ ఇన్' (Flipkart EatIn), స్విష్ (Swish) వంటి స్టార్ట‌ప్‌లు ప్ర‌వేశించాయి. ఇవి జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి అగ్రగామి కంపెనీలకు స‌వాలు విసురుతున్నాయి. ఈ కొత్త కంపెనీల పోటీ కారణంగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివ‌రీ దిగ్గ‌జాల‌పై తమ మార్కెట్ వాటాను కాపాడుకోవడం, లాభాలను పెంచుకోవడంలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.

Also Read..

వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ స‌ర్కారుపై హ‌రీశ్‌రావు ధ్వ‌జం

దారుణం.. వృద్ధురాలిని బ‌లితీసుకున్న‌ భూ వివాదం

ప్ర‌జ్వ‌ల్ ఫోన్‌లో డ‌జ‌న్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేష‌ణ‌లో వెలుగులోకి షాకింగ్ విష‌యాలు

Advertisement
Advertisement