Harish Rao | వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | వినాయక చవితి నేపథ్యంలో ఆర్టీసీ టికెట్ల చార్జీలను పెంచడంపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం మోపడం దారుణమని విమర్శించారు.
Harish Rao | వినాయక చవితి నేపథ్యంలో ఆర్టీసీ టికెట్ల చార్జీలను పెంచడంపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం మోపడం దారుణమని విమర్శించారు. ఆర్టీసీ చార్జీల పేరుతో ప్రజల జేబులకు కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లు పెడుతోందని శనివారం సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్–హన్మకొండ మధ్య ఏసీ బస్సు చార్జీ ఆగస్టు 20న రూ.410 ఉండగా.. సెప్టెంబర్ 11 నాటికి ఏకంగా రూ.570కు పెంచారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్కో ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడిందని తెలిపారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పండుగ వేళ ప్రయాణికులపై భారం
వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్తున్న సమయంలో చార్జీల పెంపు ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులపై బస్సు చార్జీల భారం మోపడం సరికాదన్నారు. గతంలో రాఖీ పండుగ సమయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని గుర్తుచేశారు. ‘మాటల్లో ఉచితాలు.. చేతల్లో ఛార్జీల మోత’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలపై భారం మోపడం ఆపి పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా చార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ప్రజా పాలన కాదని.. ప్రజలపై దోపిడీ పాలన అని విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ
సెప్టెంబర్ 12, 2026

Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్
సెప్టెంబర్ 12, 2026

Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●SIP Vs EPF | ఎస్ఐపీ వర్సెస్ ఈపీఎఫ్.. రెండింటిలో ఏది ఎక్కువ రాబడి ఇస్తుంది..?
- ●Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త
- ●Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బలితీసుకున్న భూ వివాదం
- ●Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన
- ●Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ
- ●Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

SIP Vs EPF | ఎస్ఐపీ వర్సెస్ ఈపీఎఫ్.. రెండింటిలో ఏది ఎక్కువ రాబడి ఇస్తుంది..?

Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త

Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బలితీసుకున్న భూ వివాదం

Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన



