Worker Abducted | పని మానేశాడని.. బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..
Worker Abducted | పంజాబ్‌లోని లూధియానాలో (Ludhiana) తమ కంపెనీలో పని మానేశాడని యువకుడిని ఎత్తుకెళ్లి చిత్రహింసలకు (Worker Abducted) గురిచేశారు. గత కొంతకాలంగా పర్వేశ్ గుప్తా అనే 19 ఏండ్ల యువకుడు లూధియానాలోని ఓ కంపెనీలో మెషిన్ ఆపరేటర్‌గా (Machine Operator) పనిచేస్తున్నాడు.
Worker Abducted | త్రినేత్ర.న్యూస్: పంజాబ్‌లోని లూధియానాలో (Ludhiana) తమ కంపెనీలో పని మానేశాడని యువకుడిని ఎత్తుకెళ్లి చిత్రహింసలకు (Worker Abducted) గురిచేశారు. గత కొంతకాలంగా పర్వేశ్ గుప్తా అనే 19 ఏండ్ల యువకుడు లూధియానాలోని ఓ కంపెనీలో మెషిన్ ఆపరేటర్‌గా (Machine Operator) పనిచేస్తున్నాడు. అయితే నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, ఇచ్చినా తక్కువగా ఇస్తుండంతో గత నెల పనిమానేశాడు. హెచ్ఎంటీ టూల్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న మరో కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో జూన్ 16న తన బైక్‌పై విధులకు వెళ్తుండగా అతడిని ఓ కారు అడ్డగించింది. అందులో నుంచి దిగిన వ్యక్తులు అతడిని బలవంతంగా బైక్ పైనుంచి దించి.. కారులో ఎక్కించుకు వెళ్లారు.

పట్టణానికి దూరంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో అతడిని కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. తిరిగి పనిచేరాలని బెదిరించారు. ఎలాగో అలా వారి నుంచి బయటపడిన పర్వేశ్ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పర్వేశ్‌ను బలవంతంగా కారులో ఎక్కించిన ప్రాంతంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించారు. ఐదుగురు వ్యక్తులు అతడిని కారులో తీసుకెళ్తున్నట్లు వీడియోలో రికార్డయింది. దీంతో ఫుటేజీని సాక్ష్యంగా సేకరించామని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో మరికొన్ని ఆధారాలను కూడా సేకరించినట్లు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
- ●Telegram ban | టెలిగ్రామ్‌పై నిషేధం సరైన నిర్ణయమే : ఢిల్లీ హైకోర్టు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.36వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోళ్లకు చాన్స్ వచ్చిందా..?
- ●Ponnam Prabhakar | జన్ జడ్ ఆకాంక్షల మేరకు రాహుల్ ప్రధాని కావాలి : మంత్రి పొన్నం
- ●GTA 6 | జీటీఏ 6 వచ్చేస్తోంది.. ప్రీ ఆర్డర్లు షురూ.. విడుదల ఎప్పుడు అంటే..?
- ●Stock Markets | ఐటీ షేర్లు భారీగా పతనం.. తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●SBI | ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తులు

Telegram ban | టెలిగ్రామ్‌పై నిషేధం సరైన నిర్ణయమే : ఢిల్లీ హైకోర్టు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.36వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోళ్లకు చాన్స్ వచ్చిందా..?

Ponnam Prabhakar | జన్ జడ్ ఆకాంక్షల మేరకు రాహుల్ ప్రధాని కావాలి : మంత్రి పొన్నం

GTA 6 | జీటీఏ 6 వచ్చేస్తోంది.. ప్రీ ఆర్డర్లు షురూ.. విడుదల ఎప్పుడు అంటే..?




