త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Dayakar Rao | సిగ్గు లేకుండా ఫొటోల‌కు ఫోజులా..!

Errabelli Dayakar Rao | కనీసం నీళ్లపైన అవగాహన లేకుండా ప్రాజెక్టులపై అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు మాట్లాడడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 27, 2026, 4.49 pm IST

Errabelli Dayakar Rao | సిగ్గు లేకుండా ఫొటోల‌కు ఫోజులా..!
Advertisement

రాష్ట్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Errabelli Dayakar Rao | త్రినేత్ర న్యూస్ : కనీసం నీళ్లపైన అవగాహన లేకుండా ప్రాజెక్టులపై అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు మాట్లాడడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. తొర్రూరులో మంగ‌ళ‌వారం ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మీడియాతో మాట్లాడారు.

తుమ్మిడిహెట్టిపై ఎలాంటి ఒప్పందాలు కాక‌ముందే.. చ‌ర్చ‌లు స‌ఫ‌లం అని ప్ర‌చారం చేసుకోవ‌డానికి సిగ్గ‌నిపిస్తాలేదా.? అని విమ‌ర్శించారు. ఒక వేళ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే ప్రెస్‌మీట్ పెట్టి ఎందుకు చెప్ప‌లేద‌ని నిల‌దీశారు.

కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం కట్టారు

ఆనాడు తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి హోదాలో మూడు సార్లు కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో తుమ్మిడిహెట్టిపై చర్చలు సానుకూలంగా జరిపారు. తుమ్మిడిహెట్టి బరాజ్ 148 మీటర్ల నుండి 152 మీటర్లకు పెంచాలని కేసీఆర్ ప్రతిపాదన పంపించినప్ప‌టికీ మహారాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల దృష్ట్యా సాకారం కాలేదు. కేంద్ర జల సంఘం ఆనాడు చెప్పిన నివేదికల ద్వారానే తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేని కారణంగా కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం కట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ద‌యాక‌ర్ రావు గుర్తు చేశారు.

మేడిగడ్డ సాకుగా చూపి వార్ధా ప్రాజెక్టు ఆపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం

మేడిగడ్డ సాకుగా చూపి వార్ధా ప్రాజెక్టు ఆపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డ బాగుచేసి నీళ్లు ఇవ్వడానికి చేతకాని ఈ ప్రభుత్వం పక్కా రాష్ట్రాలకు వెళ్లి ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. తుమ్మిడిహెట్టి పేరు చెప్పి కాలయాపన చేయడం తప్ప తెలంగాణకు నీళ్లు వచ్చేది లేదు. ఆనాడు వైఎస్ఆర్ హయాంలో, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఈ ప్రాజెక్ట్‌పై కమిటీలు వేసుడు తప్ప తెలంగాణకు చేసిన మేలు ఏం లేదు. ఇకనైనా రేవంత్ రెడ్డి మోసపు మాటలు, ప్రచారాలు బంద్ చేయ్ అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement