త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | బ‌యోపిక్‌లో చూపించిన‌వ‌న్నీ అబ‌ద్దాలే – ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గ‌జ బాక్స‌ర్ ఆరోప‌ణ‌లు

త‌న బ‌యోపిక్‌పై ఇండియ‌న్ బాక్స‌ర్ మేరీకోమ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో చూపించిన‌వేవీ నిజాలు కావ‌ని అన్న‌ది. సినిమా రిలీజైన 12 ఏళ్ల త‌ర్వాత మేరీకోమ్ త‌న బ‌యోపిక్‌పై విమ‌ర్శలు గుప్పించ‌డం బాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Oct 27, 2026, 4.58 pm IST

Priyanka Chopra | బ‌యోపిక్‌లో చూపించిన‌వ‌న్నీ అబ‌ద్దాలే – ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గ‌జ బాక్స‌ర్ ఆరోప‌ణ‌లు
Advertisement

Priyanka Chopra | ఇండియ‌న్ దిగ్గ‌జ బాక్స‌ర్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్‌గా 2014లో ఓ సినిమా వ‌చ్చింది. మేరీ కోమ్ పేరుతోనే రూపొందిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్ట‌వ్వ‌డ‌మే కాకుండా నేష‌న‌ల్ అవార్డును కూడా అందుకుంది. మేరీ కోమ్ పాత్ర‌లో ప్రియాంక న‌ట‌న‌కు అప్ప‌ట్లో ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

క‌ల్పిత అంశాలు...

సినిమా రిలీజైన ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఈ బ‌యోపిక్‌పై బాక్స‌ర్ మేరీకోమ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ బ‌యోపిక్ తొంభై శాతం క‌ల్పిత అంశాల‌తోనే రూపొందింద‌ని, త‌న నిజ‌జీవితంలో జ‌రిగిన చాలా సంఘ‌ట‌న‌ల‌ను ఇందులో చూపించ‌లేద‌ని ఆరోపించింది.

బిగ్‌బాస్‌లోకి...

ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పిన మేరీ కోమ్ ఇటీవ‌లే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 20లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. ఏడు వారాల్లోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ బాక్స‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న బ‌యోపిక్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది.

ప‌దో వంతు కూడా...

బాక్స‌ర్‌గా మారేందుకు నేను ప‌డిన క‌ష్టాలు, ఎదురైన అవ‌రోధాలు, పోరాటాన్ని ఆధారంగా చేసుకొని బ‌యోపిక్ చేస్తాన‌ని మేక‌ర్స్ మాటిచ్చారు. "ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక‌పోయారు. నా క‌ష్టాల్లో క‌నీసం ప‌దో వంతు కూడా సినిమాలో చూపించ‌లేదు. చాలా వ‌ర‌కు క‌ల్పితాలు, అబ‌ద్దాల‌తోనే ఆ బ‌యోపిక్ నిండిపోయింది" అని మేరీ కోమ్ అన్న‌ది. ప్రియాంక చోప్రా కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేయ‌లేక‌పోయింద‌ని మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతోన్నాయి. త‌న జీవితంలో ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే బ‌యోపిక్‌ను చూడొద్ద‌ని, తాను రాసిన అన్‌బ్రేక‌బుల్ బుక్ చ‌ద‌వాల‌ని అన్న‌ది. మేరీ కోమ్ మూవీకి సీక్వెల్ చేయాల‌నుంద‌ని కొంద‌రు త‌న‌ను సంప్రాదించార‌ని, కానీ తాను నిరాక‌రించిన‌ట్లు ఇండియ‌న్ బాక్స‌ర్ చెప్పింది. త‌న బ‌యోపిక్ రిలీజైన ప‌న్నెండేళ్ల త‌ర్వాత సినిమాను విమ‌ర్శిస్తూ మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్‌లో వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement
Advertisement