Karnataka SIR | కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. 99.32 లక్షల మంది పేర్లు ఔట్
Karnataka SIR | కర్ణాటకలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తర్వాత తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. జాబితా నుంచి దాదాపు 99.32 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.
Karnataka SIR | త్రినేత్ర న్యూస్ : కర్ణాటకలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తర్వాత తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితా నుంచి దాదాపు 99.32 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. సర్‌కు ముందు రాష్ట్రంలో 5.54 కోట్ల మంది ఓటర్లుగా ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 4,55,00,011కు పడిపోయింది.
డ్రాఫ్ట్ జాబితాలో 1.07 కోట్ల మందికిపైగా పేర్లను తొలగించగా.. తుది జాబితాలో కొత్తగా 8.64 లక్షల మంది ఓటర్లను మాత్రమే చేర్చడం గమనార్హం. తుది జాబితాలో 2.25 కోట్లకు పైగా పురుష ఓటర్లు, 2.29 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. 6.83 లక్షల కంటే ఎక్కువ మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. 85 ఏళ్లు పైబడినవారు 3.92 లక్షల మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 2,841 మంది ఉన్నారు.
ముసాయిదా జాబితాలో అడ్రెస్ మారిన వారు, ఎన్యుమరేషన్ సమయంలో ఆచూకీ దొరకని వారి కేటగిరీ కింద 80.62 లక్షల పేర్లను తొలగించారు. అదేవిధంగా మరణించారనే కారణంతో 16.39 లక్షల మంది పేర్లు, డూప్లికేట్లుగా 7 లక్షలకు పైగా, ఇతరులు కేటగిరీ కింద సుమారు 3.83 లక్షల పేర్లు తొలగించారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read..
101 ఏళ్లలో ఒక్క లేఆఫ్ లేదు.. ఈ కంపెనీ సీఈవో రూటే సపరేటు!
నెలకు 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసల్లేవా?
ఐఫోన్ డ్యుయో వినియోగదారులకు షాక్.. డిస్‌ప్లేలో సమస్య..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Assembly Elections 2027 | 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా: అధికారుల బదిలీలపై కీలక ఆదేశాలు.. ఆ డిక్లరేషన్ తప్పనిసరి!
- ●Harish Rao | నెలకు 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసల్లేవా?
- ●TG Rains | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు..
- ●El Nino | ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష సమావేశం
- ●Torani No Layoffs | 101 ఏళ్లలో ఒక్క లేఆఫ్ లేదు.. ఈ కంపెనీ సీఈవో రూటే సపరేటు!
- ●IND Vs NZ T20 | అభిషేక్ శర్మ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం

Assembly Elections 2027 | 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా: అధికారుల బదిలీలపై కీలక ఆదేశాలు.. ఆ డిక్లరేషన్ తప్పనిసరి!

Harish Rao | నెలకు 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసల్లేవా?

TG Rains | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు..

El Nino | ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష సమావేశం






