Harish Rao | సీఎం రేవంత్ మౌనమే.. చంద్రబాబుకు ధైర్యమా..?
Harish Rao | తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడమే ఏపీ సీఎం చంద్రబాబు ధైర్యమా..? అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్‌ది చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడమే ఏపీ సీఎం చంద్రబాబు ధైర్యమా..? అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్‌ది చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు. జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చిన అంశాలను ఎండగడుతూ.. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడారు.
గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ) సమావేశం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతున్నట్టు ఉంది. ఏపీ కోసమే జీఆర్ఎంబీ పని చేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు స్పష్టంగా ఉన్నాయి. జీఆర్ఎంబీ ఎజెండా రెండు రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. ఎజెండాలో ఉన్న అంశాలపై తెలంగాణ కళ్లు తెరుస్తాలేదు.. సోయి లేదు.. వారం రోజులైనా అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కడుపు మండిపోతోంది.. రక్తం మరిగిపోతోంది..
జీఆర్ఎంబీ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతోంది.. రక్తం మరిగిపోతోంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు. తెలంగాణ భవిష్యత్‌ను ఆగం చేసే విధంగా, సాగు, తాగు నీరు దక్కకుండా కుట్రలతో కూడిన ఎంజెండా వస్తే గుడ్డి గుర్రం పళ్లు తోముతుండా..? నీటి ప్రయోజాలను ఏపీకి తాకట్టు పెట్టదలచుకున్నారా..? అని నిలదీశారు.
చంద్రబాబు అంటే అంత భయమా..?
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తుంటే సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నడు. సోయి లేకానా..? ఆత్మగౌరవం లేకనా..? గురుదక్షిణ చెల్లించడానికా..? ఎందుకు మౌనం వహిస్తున్నడు. ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నడు. ప్రతిపక్షాలపై విరుకుచుపడే నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వతంగా సమాధి కడుతుంటే, కుట్రలు చేస్తుంటే ఎందుకు మౌనం..? చంద్రబాబు అంటే అంత భయమా..? గురుదక్షిణా..? భక్తా..? ఎందుకు మాట్లాడటం లేదు అని సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు నిలదీశారు.
ఏడు ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలా..?
ఈ నెల 18న జీఆర్ఎంబీ సమావేశం ఉంది. ఆ ఎజెండాలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసే అంశాలు ఉన్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ 240 టీఎంసీలు, చౌటుపల్లి హనుమంత రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీలు, చిన్న కాళేశ్వరం 4.8 టీఎంసీ, చనకా కొరటా 1.2 టీఎంసీ, మోడీ కుంట వాగు ప్రాజెక్టు 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు 67.5 టీఎంసీలు.. ఈ ప్రాజెక్టులన్నీంటికీ కేసీఆర్ అనుమతులు తెస్తే.. ఇచ్చిన అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ ప్రతిపాదించింది. జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టేశాడు. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి.. నోటికాడ బుక్క లాక్కోండి అని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే.. ఎంజెడాలో పెట్టారు.. ఎలా అర్థం చేసుకోవాలి అని హరీశ్‌రావు అడిగారు.
ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది
ఈ విషయంలో తెలంగాణ ఇంజినీర్లకు మతి లేదా..? ఇంజినీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడా..? ఎజెండా ఎట్ట వచ్చింది. రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడది..? ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది..? తెలంగాణ ఎట్ల కనబడుతుంది.. నీళ్ల కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే ఎలా రద్దు చేస్తారు. తెచ్చిన అనుమతులు రద్దు అవుతాయా..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో ఒక్క టీఎంసీకి క్లియరెన్స్ తేలేదు.. ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తేలేదు. మీరు వచ్చిన తర్వాత డీపీఆర్‌లు రిటర్న్ వచ్చాయి.. సమ్మక, పాలమూరు ఎత్తిపోతల, వాగ్దా డీపీఆర్ వాపస్ వచ్చింది. ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నిద్ర పోతున్నారా..? తెలంగాణ భవిష్యత్‌తో ఆడుకుంటారా..? మీకు సోయి ఉందా..? అనుమతి తేకపోతిరి.. వాపస్ తెస్తిరి.. ఏడు ప్రాజెక్టుకులను నీటి కేటాయింపులు రద్దు చేయండి.. టీఏసీ రద్దు చేయండని రాస్తరు.. దుర్మార్గమైన అంశం ఇది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
సెప్టెంబర్ 20, 2026

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
సెప్టెంబర్ 20, 2026

Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



