KTR | రేపు కన్నేపల్లికి కేటీఆర్
KTR | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సందర్శించనున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతల బృందం కూడా పంప్‌హౌజ్‌ను పరిశీలించనుంది. ప్రస్తుతం గోదావరిలో లభిస్తున్న ప్రవాహాన్ని వినియోగించుకునేలా కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
- లక్ష్మి పంప్‌హౌస్‌ను సందర్శించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- మోటార్లు ఆన్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పర్యటన
KTR | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సందర్శించనున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతల బృందం కూడా పంప్‌హౌజ్‌ను పరిశీలించనుంది. ప్రస్తుతం గోదావరిలో లభిస్తున్న ప్రవాహాన్ని వినియోగించుకునేలా కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంథని నియోజకవర్గ పరిధిలోని కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం వృథాగా పోతున్న గోదావరి జలాలను కేటీఆర్ పరిశీలించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ సంస్థలు అంచనా వేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లు కేవలం 23 శాతం మాత్రమే నిండిన పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరిలో 15వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం నమోదవుతోంది. రాబోయే రోజుల్లో అది 60వేల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డపై పూర్తిగా ఆధారపడకుండా కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద నుంచే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభిస్తే ప్రస్తుతం గోదావరిలో వస్తున్న ప్రవాహాన్ని వినియోగించి వ్యవసాయ అవసరాలతో పాటు తాగునీటి అవసరాలకూ నీటిని అందించవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కన్నేపల్లి పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదుకు ఈ పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్
జులై 4, 2026

Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!
జులై 4, 2026

Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 4, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్
- ●Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
- ●Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!
- ●Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!
- ●Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!
- ●Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..

Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!

Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!

Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!



