త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేల‌పై ప‌డేసి కాలితో తొక్కిన కుమారుడు

Hyderabad | ఓ కుమారుడు క్రూర‌మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. తండ్రిని నేల‌పై ప‌డేసి కాలితో తొక్కి ప్రాణాలు తీసేందుకు య‌త్నించాడు. ఆస్తి వివాదం కోసం జ‌రిగిన ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం ఉప్ప‌ర‌ప‌ల్లిలో వెలుగు చూసింది.

S

Hyderabad | Published On Jun 24, 2026, 2.01 pm IST

Hyderabad | ఆస్తి వివాదం.. తండ్రిని నేల‌పై ప‌డేసి కాలితో తొక్కిన కుమారుడు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : ఓ కుమారుడు క్రూర‌మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. తండ్రిని నేల‌పై ప‌డేసి కాలితో తొక్కి ప్రాణాలు తీసేందుకు య‌త్నించాడు. ఆస్తి వివాదం కోసం జ‌రిగిన ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం ఉప్ప‌ర‌ప‌ల్లిలో వెలుగు చూసింది. తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉప్ప‌ర‌ప‌ల్లికి చెందిన అనంత్ రెడ్డికి 31 గుంట‌ల భూమి ఉంది. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఈ క్ర‌మంలో 31 గుంట‌ల భూమిని కుమారులిద్ద‌రికి స‌మానంగా పంచాడు. మ‌రో 300 గజాల స్థ‌లాన్ని అనంత్ రెడ్డి త‌న పేరు మీద రాయించుకున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యానికి ఆస‌రా అవుతుంద‌ని ఆ 300 గ‌జాలు త‌న వ‌ద్దే త‌న పేర‌నే రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడు.

అయితే ఆ 300 గజాలు కూడా త‌న పేరు మీద రాయాల‌ని.. చిన్న‌కుమారుడు ఓం రెడ్డి తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్ర‌మంలోనే తండ్రీకొడుకుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. స‌హ‌నం కోల్పోయిన చిన్న‌కుమారుడు ఓంరెడ్డి తండ్రిపై దాడి చేశాడు. అంతేకాకుండా అన్న ర‌వికాంత్ రెడ్డి, వ‌దిన‌పై కూడా దాడికి పాల్ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఈ ఘటనపై అనంత్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపేస్తానంటూ తన కుమారుడు బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు. అనంత్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement