Sonia Singh | ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న సోనియా సింగ్ – ముహూర్తం ఫిక్స్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నుంచి యాక్టర్‌గా మారిన సోనియా సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ప్రియుడు పవన్ సిద్దూతో ఏడడుగులు వేయబోతుంది. తమ పెళ్లి డేట్‌తో పాటు ముహూర్తాన్ని వెల్లడించింది.
Entertainment | Published On Jul 4, 2026, 3.43 pm IST
Sonia Singh | సోనియా సింగ్, పవన్ సిద్ధూ సోషల్ మీడియా లవర్స్‌కు సుపరిచితులే. ఇన్‌ఫ్లూయెన్సర్లుగా కెరీర్‌ను ప్రారంభించిన వీరిద్దరు పలు వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో జంటగా నటించారు. పవన్ సిద్దూ, సోనియా సింగ్ ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ రూమర్లపై సోనియా క్లారిటీ ఇచ్చింది. తమ పెళ్లి డేట్‌తో పాటు ముహూర్తం టైమ్ కూడా చెప్పేసింది.
కిస్సిక్ టాక్స్...
జబర్ధస్థ్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్స్ షోకు సోనియా సింగ్ గెస్ట్‌గా వచ్చింది. ఈ షో తాలూకు ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో సిద్దూతో నీ పెళ్లి ఎప్పుడూ అంటూ వర్ష అడిగింది. ఏమో మా పెళ్లి అయిపోయిందేమే అంటూ ఫన్నీగా సోనియా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ..."సెప్టెంబర్ 2న...రాత్రి 1.45 నిమిషాలకు సిద్దూతో నా పెళ్లి జరగబోతుంది" అంటూ ముహూర్తాన్ని రివీల్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. పెళ్లి కోసం చాలా రోజులు నుంచే డబ్బులను దాచిపెడుతున్నట్లు చెప్పింది. గత ఏడాది హైదరాబాద్‌లో ఓ ఇల్లు కూడా కొన్నారట. అంతే కాకుండా బెంజ్ కారు తీసుకున్నారట. ఇవి కొన్న టైమ్‌లో తమపై చాలా విమర్శలు వచ్చాయని, కానీ కష్టపడిన డబ్బులతోనే వాటిని కొనుగోలు చేసినట్లు సోనియా చెప్పింది. సోనియా కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
యూట్యూబ్ సిరీస్...
సిద్దూ, సోనియా సింగ్ కలిసి అనసూయ రామలింగం, నీవే ఇట్లు నీ ప్రేమతో పాటు మరికొన్ని యూట్యూబ్ సిరీస్‌లు చేశారు. వీరిద్దరు జంటగా నటించిన శశిమథనం వెబ్‌సిరీస్ గత ఏడాది ఇటీవీ విన్‌లో రిలీజైంది. విరూపాక్షతో సోనియా సింగ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ స్నేహితురాలిగా కనిపించింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది
నాగబంధంలో...
ఈ వారం థియేటర్లలో రిలీజైన నాగబంధంలో సోనియా సింగ్ హీరో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఆమె క్యారెక్టర్‌కు తెలుగు ఆడియెన్స్ నుంచి చక్కటి రెస్పాన్స్ వస్తోంది. నాగబంధం సినిమాలో విరాట్ కర్ణ హీరోగా నటించాడు. వంద కోట్ల బడ్జెట్ తో సోషియా ఫాంటసీ థ్రిల్లర్ గా మూవీ రూపొందింది.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



