త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? మ‌మ‌తా బెన‌ర్జీకి కీల‌క ప్ర‌తిపాద‌న చేసిన సోనియా గాంధీ

TMC-Congress | ప‌శ్చిమ బెంగాల్‌లో తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (TMC).. ఇప్పుడు తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ఈ ప‌రిణామాల వేళ ఆస‌క్తికర అంశం తెర‌పైకి వ‌చ్చింది. తృణ‌మూల్ మ‌ళ్లీ సొంత గూటికి చేరే అవ‌కాశం ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఎంసీని కాంగ్రెస్‌ (Congress)లో విలీనం చేసే అవ‌కాశం ఉందంటూ కొత్త చ‌ర్చ మొద‌లైంది.

D

National | Published On Jun 10, 2026, 5.44 pm IST

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? మ‌మ‌తా బెన‌ర్జీకి కీల‌క ప్ర‌తిపాద‌న చేసిన సోనియా గాంధీ
Advertisement

TMC-Congress | ప‌శ్చిమ బెంగాల్‌లో తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (TMC).. ఇప్పుడు తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆ పార్టీని అంధ‌కారంలోకి నెట్టింది. పార్టీలో అంత‌ర్గ‌త సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇప్ప‌టికే సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్‌స‌భ ఎంపీలు తిరుగుబావుటా ఎగుర‌వేసిన విష‌యం తెలిసిందే. మిగ‌తావారు కూడా ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. ఈ ప‌రిణామాల వేళ ఆస‌క్తికర అంశం తెర‌పైకి వ‌చ్చింది. తృణ‌మూల్ మ‌ళ్లీ సొంత గూటికి చేరే అవ‌కాశం ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఎంసీని కాంగ్రెస్‌ (Congress)లో విలీనం చేసే అవ‌కాశం ఉందంటూ కొత్త చ‌ర్చ మొద‌లైంది.

నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)తో మ‌మ‌తా బెన‌ర్జీ స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బీజేపీ వరుస విజయాలు, టీఎంసీ భ‌విష్య‌త్తు, కూట‌మి రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయ‌డం, ఎంపీలు రాజీనామా వంటి అంశాల‌ను సోనియాకు దీదీ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌మ‌తా బెన‌ర్జీకి సోనియా గాంధీ ఓ కీల‌క సూచ‌న చేసిన‌ట్లుగా తెలిసింది. టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని మమతను కోరార‌ట‌.

టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని దీదీకి సోనియా హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు, మ‌మ‌త‌ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేందుకు అంగీకరించార‌ట‌. అయితే, ఈ ఆఫ‌ర్‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌స్తుతం ఆలోచిస్తున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిసింది. ప్ర‌స్తుత ప‌రిణామాల దృష్ట్యా విలీనం చేసే అవ‌కాశాన్ని దీదీ ప‌రిశీలిస్తున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్ర‌ధాన‌ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ అవ‌డం ఈ ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరుస్తోంది.

అయితే, ఈ రూమ‌ర్స్‌ను టీఎంసీ నేత‌లు ఖండిస్తున్నారు. అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ రాలేద‌ని చెబుతున్నారు. చూడాలి మ‌రి టీఎంసీ చివ‌రికి త‌న సొంత గూటికి చేరుతుందో..? లేక ఒంట‌రిగానే పోరాటం సాగిస్తుందో. కాగా, హ‌స్తం పార్టీ నుంచి విడిపోయి 1997లో మ‌మ‌తా బెనర్జీ టీఎంసీని స్థాపించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత బెంగాల్‌లో టీఎంసీ తిరుగులేని శ‌క్తిగా ఎదిగింది.

Also Read..

దీదీని ప్ర‌ధానిగా చూడాల‌నుకుంది.. క‌ట్‌చేస్తే ఆ పార్టీలో భ‌విష్య‌త్తే లేదంటూ రెబ‌ల్ గ్రూప్‌లో చేరిన ఎంపీ

మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్‌న‌గ‌ర్‌లో 168 మెగావాట్ల డేటా సెంట‌ర్ ఏర్పాటు..

మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్‌న‌గ‌ర్‌లో 168 మెగావాట్ల డేటా సెంట‌ర్ ఏర్పాటు..

Advertisement
Advertisement