త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Canva | ఇక ఇంట‌ర్నెట్ లేకున్నా కాన్వా ప‌నిచేస్తుంది.. ఎక్క‌డైనా డిజైన్లు చేసుకోవ‌చ్చు..

Canva | ప్ర‌ముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా బుధవారం కాన్వా ఆఫ్‌లైన్ పేరిట కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా యూజర్లు తమ డిజైన్లను సృష్టించడం, ఎడిట్ చేయడం కొనసాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఎక్కువగా కోరిన ఫీచర్లలో ఇది ఒకటని కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Jun 10, 2026, 6.01 pm IST

Canva | ఇక ఇంట‌ర్నెట్ లేకున్నా కాన్వా ప‌నిచేస్తుంది.. ఎక్క‌డైనా డిజైన్లు చేసుకోవ‌చ్చు..
Advertisement

Canva | ప్ర‌ముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా బుధవారం కాన్వా ఆఫ్‌లైన్ పేరిట కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా యూజర్లు తమ డిజైన్లను సృష్టించడం, ఎడిట్ చేయడం కొనసాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఎక్కువగా కోరిన ఫీచర్లలో ఇది ఒకటని కంపెనీ తెలిపింది. కొత్త ఆఫ్‌లైన్ మోడ్‌తో ప్రయాణాల్లో, రోజువారీ కమ్యూట్ సమయంలో, తరగతులకు హాజరవుతున్నప్పుడు లేదా నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ యూజర్లు తమ ప్రాజెక్టులపై పని చేయవ‌చ్చు. ముఖ్యంగా మొబైల్-ఫస్ట్ యూజర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కాన్వా వెల్లడించింది. కనెక్టివిటీ సమస్యలు సృజనాత్మకతకు, ఉత్పాదకతకు అడ్డంకిగా మారకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఏడాది జరిగిన కాన్వా క్రియేట్ కార్యక్రమంలో దీనిని తొలిసారి ప్రకటించగా, ఇప్పుడు అధికారికంగా యూజర్లకు విడుదల చేస్తున్నారు.

ముందుగానే సెట్ చేయాలి..

యూజర్లు తమ డిజైన్లను ముందుగానే ఆఫ్‌లైన్ యాక్సెస్ కోసం సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా సపోర్ట్ చేసే డివైస్‌లు, ఫార్మాట్‌లలో వాటిని ఎడిట్ చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో చేసిన మార్పులు ఇంటర్నెట్ తిరిగి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. ఈ ఫీచర్‌ను కాన్వా యూజర్లకు అంద‌రికీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే అందిస్తున్నారు. ఆఫ్‌లైన్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత గరిష్టంగా 14 రోజుల పాటు ఇంటర్నెట్ లేకుండానే డిజైన్లను సృష్టించడం, సవరించడం కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది. దీనిని ఉపయోగించాలంటే కనెక్టివిటీ కోల్పోయే ముందు సంబంధిత డిజైన్‌లో మేక్ అవైలబుల్ ఆఫ్‌లైన్ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. భారత్ తమకు అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారిందని కాన్వా పేర్కొంది. దేశంలోని మొబైల్-ఫస్ట్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్ మోడ్‌ను రూపొందించినట్లు తెలిపింది.

గూగుల్ జెమినికి అనుసంధానంగా..

ఈ సందర్భంగా కాన్వా గ్లోబల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ రాబ్ కావాస్‌ల్కీ మాట్లాడుతూ భారత్‌లోని యూజర్లు మొబైల్-ఫస్ట్ విధానంలో ఎప్పుడూ కొత్త ఆలోచనలతో పనిచేస్తున్నార‌ని, వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పరిష్కారమే ఆఫ్‌లైన్ మోడ్ అని అన్నారు. గూగుల్ ఇటీవ‌లే జెమిని కోసం కాన్వా క‌నెక్టెడ్ యాప్‌ను తీసుకొచ్చింద‌ని, అందులో భాగంగానే ఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. కాన్వా సొంత ఫౌండేష‌న్ మోడ‌ల్ ఆధారంగా ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంద‌ని, దీని వ‌ల్ల జెమినిలో క్రియేట్ చేసిన డిజైన్ల‌ను నేరుగా కాన్వాలోనూ ఎడిట్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. టీమ్ స‌భ్యులు వాటిని మ‌రింత మెరుగు ప‌ర‌చ‌డం, రీమిక్స్ చేయ‌డం లేదా తోటి ఉద్యోగుల‌కు పంపించ‌డం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌న్నారు. కాగా గూగుల్ అభివృద్ధి చేసిన నానో బ‌నానా ఇమేజ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను కాన్వాలోని మ్యాజిక్ లేయర్స్ ఫీచ‌ర్‌లోనూ అందిస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement