CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ‘హ్యామ్’ (Hybrid Annuity Model - HAM) విధానంలో చేపడుతున్న రూ. 13,000 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ‘హ్యామ్’ (Hybrid Annuity Model - HAM) విధానంలో చేపడుతున్న రూ. 13,000 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
హ్యామ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిందని, అదే నమూనాలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6,300 కిలోమీటర్ల రహదారులను 34 ప్యాకేజీల్లో డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్క్ ఆర్డర్లు జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమలు కోసం తాను గత ఏడాది కాలంగా నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరో రూ. 7,000 కోట్ల అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి తెలిపారు.
నల్లగొండ జిల్లాలో రెండు ప్యాకేజీల్లో..
మొదటి ప్యాకేజీ : దర్వేష్‌పురం నుంచి గుర్రంపోడు, మల్లెపల్లి, దేవరకొండ మీదుగా దిండి వరకు సుమారు రూ. 300 కోట్లతో డివైడర్‌తో కూడిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండవ ప్యాకేజీ : చిట్యాల నుంచి రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా జగదేవ్‌పూర్ వరకు సుమారు రూ. 300 కోట్లతో డబుల్ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో కూడా సుమారు రూ. 300 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
- ●Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..
- ●Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ
- ●Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్నగర్లో 168 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు..

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు

Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..

Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!



