త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy | 2027 వేస‌వి చివ‌రి నాటికి మేడిగ‌డ్డ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌ని నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగ‌డ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సాంకేతిక పరిశోధనలతో పాటు ఇతరత్రా పరీక్షలు నిర్వహిస్తున్న తీరును బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డకు చేరుకుని స్వయంగా పర్యవేక్షించారు.

S

Telangana | Published On Jun 10, 2026, 6.31 pm IST

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : 2027 వేస‌వి చివ‌రి నాటికి మేడిగ‌డ్డ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌ని నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగ‌డ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సాంకేతిక పరిశోధనలతో పాటు ఇతరత్రా పరీక్షలు నిర్వహిస్తున్న తీరును బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డకు చేరుకుని స్వయంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జులై మొదట వారానికి సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాలు పూర్తి చేస్తాం. 2026 సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్‌లను పూర్తి చేస్తాం. 2026 నవంబర్ డిసెంబర్ తొలి వారంలో పునరుద్ధరణ పనులు ప్రారంభం చేస్తామ‌న్నారు. హైడ్రాలజికల్ అధ్యయనాలతో పాటు జియో టెక్నీకల్ బోర్ హొల్ పరిశోధనలు, ఇతర సాంకేతిక పరీక్షలు వేగవంతం చేశాం. ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని, జూన్ చివరి నాటికి పరిశోధనలు, పరీక్షలను పూర్తి చేస్తాం. పరిశోధనలు, పరీక్షల తుది నివేదికను సీడ‌బ్ల్యూసీతో పాటు ఎన్‌డీఎస్ఏకు పంపుతామ‌ని మంత్రి ఉత్త‌మ్ తెలిపారు.

బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలతో ఇంతటి నష్టం సంభవించింది. బ్యారేజీల‌ను సుర‌క్షితంగా పున‌రుద్ధ‌రిస్తాం. పునరుద్ధరణ పనులతో పాటు బ్యారేజీల భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించాం. రూ. 38,000 కోట్లతో మొదలు పెట్టిన చేవెళ్ల-ప్రాణహిత 2014 నాటికి మూడోవంతు పనులు పూర్తి చేశాం. ఆ ప్రాజెక్టును కొనసాగించి ఉంటే 2026-17 నాటికి పూర్త‌యి 16 లక్షల ఆయకట్టుకు సాగు నీరు చేరేది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ‌ రాష్ట్రంలో కొలువు దీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో అంచనాలు పెద్ద ఎత్తున పెంచారు. రూ. 38,000 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు దాటింది. కాగ్ అంచనాల ప్రకారం రూ. కోటి 45 లక్షలకు చేరుతుందన్నది అంచనా వేస్తున్నారు. ఇంతటి భారీ వ్యయంతో నిర్మించినప్పటికీ 2023 డిసెంబర్ 7 తరువాత మూడు బ్యారేజీలు వినియోగంలో లేకపోవడం దురదృష్టకర‌మ‌ని మంత్రి తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బ్యారేజీలకు డ్యామేజ్ ఏర్ప‌డింది. డ్యామేజీల‌పై వేసిన న్యాయ కమిషన్‌, ఎన్‌డీఎస్ఏ నిర్మాణంలో లోపాలను గుర్తించారు. తెలంగాణ‌ రైతాంగా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాం. పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెంట్ సంస్థ AFRYతో పాటు ఐఐటీ ముంబై వారిని నియమించాం. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ నమూనాలు సేకరించి అధ్యయనం చేయడంతో పాటు సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ నిపుణులని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్నాం. ఎన్‌డీఎస్ఏ గుర్తించిన లోపాలను పూర్తి స్థాయిలో అధ్యయనం జరుపుతున్నారు. మూడు బ్యారేజీలలో జీపీఆర్ పరీక్షలు 90 శాతం వరకు పూర్తి చేశాం. బోర్ హోల్, జియో టెక్నికల్ పరిశోధనలు 80 శాతం వరకు పూర్తి చేశాం. మున్ముందు ఈ తరహా డ్యామేజీలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను 40 నుండి 80 మీటర్ల లోతుకు బోర్ హొల్స్ తవ్వుతున్నాం. కేంద్ర జలసంఘం, ఎన్‌డీఎస్ఏ ఆమోదం త‌ర్వాత‌నే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామ‌న్నారు.

Advertisement
Advertisement