Mumbai Next Mayor | ముంబై కొత్త మేయర్ ఎవరు? పీఠం కోసం బీజేపీ, షిండే సేన మధ్య బిగ్ ఫైట్
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి కాస్త దూరంలో ఉంది. అలాగే షిండే సేన కూడా తక్కువ స్థానాలే గెలుచుకుంది. ఈ రెండు పార్టీలు కలిస్తేనే బీఎంసీ పీఠం మహాయుతికి దక్కుతుంది.
Mumbai Next Mayor | బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా అవిభక్త శివ సేన ముంబై పీఠాన్ని గుప్పిట్లో పెట్టుకొని పాలించింది. మహాయుతి కూటమి ఆ కోటను తాజాగా బద్దలు కొట్టింది. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, షిండే సేన పార్టీల స్థానాలు మెజారిటీ మార్క్‌ను క్రాస్ చేయడంతో ముంబై పీఠం ఈసారి మహాయుతికే దక్కనుంది. కానీ.. మేయర్ ఎవరు అవుతారు? అనే దానిపై బీజేపీ, షిండే సేన వర్గాల్లో అంతర్గతంగా పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి కాస్త దూరంలో ఉంది. అలాగే షిండే సేన కూడా తక్కువ స్థానాలే గెలుచుకుంది. ఈ రెండు పార్టీలు కలిస్తేనే బీఎంసీ పీఠం మహాయుతికి దక్కుతుంది. కానీ.. మేయర్ పదవిని బీజేపీకి ఇచ్చేందుకు షిండే సేన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ శనివారం నిర్వహించిన కేబినేట్ మీటింగ్‌కి ఏక్‌నాథ్ షిండే హాజరు కాలేదు. దీంతో మరోసారి ముంబై పీఠం కోసం ఈ రెండు పార్టీల మధ్య పోరు ప్రారంభం అయినట్లు కనిపిస్తోంది.
29 మంది కార్పొరేట్లను హోటల్‌కి తరలించిన షిండే
మరోవైపు షిండే సేనకు చెందిన 29 మంది కార్పొరేటర్లను ఫైవ్ స్టార్ హోటల్‌కి తరలించి అక్కడే సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. 29 మంది కార్పొరేటర్లు ఏ నేత ఆఫర్లకు తలొగ్గకుండా ఉండేందుకు, ముంబై మేయర్ పదవి నియామకం జరిగే వరకు వాళ్లను ఎవరు తమవైపునకు తిప్పుకోకుండా ఉండేందుకు షిండే ముందే వాళ్లను సీక్రెట్ ప్లేస్‌కి తరలించారు. దీన్ని బట్టి చూస్తే మేయర్ పీఠం కోసం షిండే పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమౌతోంది. ఈ వారంలోనే మేయర్ పదవిపై బీజేపీ హైకమాండ్ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. బీజేపీకి ప్రస్తుతం ఉన్నది 89 స్థానాలే. షిండే సేన 29 స్థానాలు కూడా కలిస్తేనే మెజార్టీ మార్క్ 114 ని క్రాస్ చేస్తుంది.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



